ఏమిరా నన్ను నే లనేవు నీవు
(॥పల్లవి॥)
ఏమిరా నన్ను నే లనేవు నీవు
కామించినట్లానే కా దనేనా
(॥ఏమిరా॥)
పిలువనా నిలువనా ప్రియముతో నీయెదుట
చెలులచే నప్పటిఁ జెప్పి యంపనా
(॥ఏమిరా॥)
పెనఁగఁగ నేలరా బిగిసేవు నాతో
వినయముల నే నిన్ను వేఁడుకొననా
(॥ఏమిరా॥)
శ్రీవేంకటేశ నన్నుఁ జెలరేఁగి కూడితివి
దేవుఁడవు నీకు నే దేవులనే కానా
(||pallavi||)
emirā nannu ne lanevu nīvu
kāmiṁchinaṭlāne kā danenā
(||emirā||)
piluvanā niluvanā priyamudo nīyĕduḍa
sĕlulase nappaḍim̐ jĕppi yaṁpanā
(||emirā||)
pĕnam̐gam̐ga nelarā bigisevu nādo
vinayamula ne ninnu vem̐ḍugŏnanā
(||emirā||)
śhrīveṁkaḍeśha nannum̐ jĕlarem̐gi kūḍidivi
devum̐ḍavu nīgu ne devulane kānā