ఏమిమాట ఇచ్చితివో యేకతానను
(॥పల్లవి॥)
ఏమిమాట ఇచ్చితివో యేకతానను
నీ మది దలఁచుకొని నెరవేర్చరాదా
(॥ఏమి॥)
చేరఁడేసికన్నులచెలియ నీమోము చూచె
కూరమి గొసరీ నిన్నుఁ గొలువులొన
నారుకొన సెలవుల నవ్వు లేమినవ్వేవు
చేరి యాపెచనవులు చేకొనఁగరాదా
(॥ఏమి॥)
పట్టెఁడేసిగుబ్బలపడఁతి కానుక యిచ్చి
గుట్టుకతోడ నెచ్చరించీ గోర నంటుచు
బట్టబయలు సిగ్గునఁ బరాకులేల సేసేవు
చుట్టమైతేఁ గాఁగిలించి చొక్కించరాదా
(॥ఏమి॥)
నిలువుఁదురుముతోడినెలఁత నీకు మొక్కి
వలపులు చల్లీ సన్నలు సేయుచు
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
కలసితి వాపె నిట్టె కడుమన్నించరాదా
(||pallavi||)
emimāḍa ichchidivo yegadānanu
nī madi dalam̐sugŏni nĕraversarādā
(||emi||)
seram̐ḍesigannulasĕliya nīmomu sūsĕ
kūrami gŏsarī ninnum̐ gŏluvulŏna
nārugŏna sĕlavula navvu leminavvevu
seri yābĕsanavulu segŏnam̐garādā
(||emi||)
paṭṭĕm̐ḍesigubbalabaḍam̐ti kānuga yichchi
guṭṭugadoḍa nĕchchariṁchī gora naṁṭusu
baṭṭabayalu siggunam̐ barāgulela sesevu
suṭṭamaidem̐ gām̐giliṁchi sŏkkiṁcharādā
(||emi||)
niluvum̐durumudoḍinĕlam̐ta nīgu mŏkki
valabulu sallī sannalu seyusu
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
kalasidi vābĕ niṭṭĕ kaḍumanniṁcharādā