Emigaam joosinaamde ippudu nannu

ఏమిగాఁ జూచినాఁడే ఇప్పుడు నన్ను
Language

(॥పల్లవి॥)
ఏమిగాఁ జూచినాఁడే ఇప్పుడు నన్ను
వేమారు తను నంత వేసరించేదాననా

(॥ఏమి॥)
కొప్పు దువ్వి న న్నితఁడు కొసరి వేఁడుకొనీని
అప్పటిమాటలకే నే నలిగేనటే
తప్పకచూచి నన్ను తగ నవ్వు నవ్వించీ
తప్పు లెంచి నేఁ దనతో తమకించేదాననా

(॥ఏమి॥)
పెనఁగి నావొడివట్టి ప్రియములు చెప్పీఁ దాను
వెనకటి సేఁతలకు విసిగే నటే
కనుసన్న సేసి నన్ను కమ్మటిఁ జొక్కించీని
మనసు సోదించి తనమర్మాలెత్తే దాననా

(॥ఏమి॥)
చేతులు చాచిఁ నన్నుఁ జెనకి కాఁగిట నించీ
రాతిటి పంతములకు రావాడేనటే
యీతల శ్రీవేంటేశుఁ డీతఁడిట్టె నన్నునేల
యేతులకు నే దనతో యెదురాడేదాననా

(||pallavi||)
emigām̐ jūsinām̐ḍe ippuḍu nannu
vemāru tanu naṁta vesariṁchedānanā

(||emi||)
kŏppu duvvi na nnidam̐ḍu kŏsari vem̐ḍugŏnīni
appaḍimāḍalage ne naligenaḍe
tappagasūsi nannu taga navvu navviṁchī
tappu lĕṁchi nem̐ danado tamagiṁchedānanā

(||emi||)
pĕnam̐gi nāvŏḍivaṭṭi priyamulu sĕppīm̐ dānu
vĕnagaḍi sem̐talagu visige naḍe
kanusanna sesi nannu kammaḍim̐ jŏkkiṁchīni
manasu sodiṁchi tanamarmālĕtte dānanā

(||emi||)
sedulu sāsim̐ nannum̐ jĕnagi kām̐giḍa niṁchī
rādiḍi paṁtamulagu rāvāḍenaḍe
yīdala śhrīveṁṭeśhum̐ ḍīdam̐ḍiṭṭĕ nannunela
yedulagu ne danado yĕdurāḍedānanā