ఏమిటివాఁడ నేను యిందులోను దైవమా
(॥పల్లవి॥)
ఏమిటివాఁడ నేను యిందులోను దైవమా
కామించి నీ మాయ లింతే కానవచ్చీ నాకు
(॥ఏమిటి॥)
సాలీఁడనే పురువు జటరముపొంగువలె
చాలుకొని వచ్చీని సంసారబంధము
కాలము కొలఁది వచ్చి గ్రహచక్రమువలె
పాలుపడి జన్మములు బడీఁ దిరిగి
(॥ఏమిటి॥)
పొరి నడవిమృగము పుట్టుతానే చన్నుదాగే
స్మరణవలెనే నా విషయభోగాలు
పరగ నీరు వందడి పారే నీరువలె
సిరుల వెంటఁ బారీ నా చిత్తవికారాలు
(॥ఏమిటి॥)
మొదల నీచేఁత లివి మోచు టెంతే కాక
పదరి తలఁచరాదు పలుకరాదు
పొదిటి శ్రీ వేంకటేశ పూఁచి నీకే శరణని
యెదుట నున్నాఁడ నింతే యింకా నీచిత్తము
(||pallavi||)
emiḍivām̐ḍa nenu yiṁdulonu daivamā
kāmiṁchi nī māya liṁte kānavachchī nāgu
(||emiḍi||)
sālīm̐ḍane puruvu jaḍaramubŏṁguvalĕ
sālugŏni vachchīni saṁsārabaṁdhamu
kālamu kŏlam̐di vachchi grahasakramuvalĕ
pālubaḍi janmamulu baḍīm̐ dirigi
(||emiḍi||)
pŏri naḍavimṛgamu puṭṭudāne sannudāge
smaraṇavalĕne nā viṣhayabhogālu
paraga nīru vaṁdaḍi pāre nīruvalĕ
sirula vĕṁṭam̐ bārī nā sittavigārālu
(||emiḍi||)
mŏdala nīsem̐ta livi mosu ṭĕṁte kāga
padari talam̐sarādu palugarādu
pŏdiḍi śhrī veṁkaḍeśha pūm̐si nīge śharaṇani
yĕduḍa nunnām̐ḍa niṁte yiṁkā nīsittamu