Emidim dalabomta yissee romta

ఏమిటిఁ దలపోఁత యిస్సీ రోఁత
Language

(॥పల్లవి॥)
ఏమిటిఁ దలపోఁత యిస్సీ రోఁత
వేమారు ననలేను వెల్లవిరి నేను

(॥ఏమి॥)
చెంగావినీమోవిచెలువెల్లా దేవి దేవి
యెంగిలైనచీకాకు యేఁటికి నాకు
సంగతాయ నటు వోర సారె నేల నిన్నుదూర
యింగితపునీగుణాలు యెఱిఁగితిఁ జాలు

(॥ఏమి॥)
మొక్కేటిది యీమొక్కు మున్నీటిచెలులు పెక్కు
తొక్కితొక్కి కోపానఁ దోసిన వోల
యిక్కడఁ దలఁచరాదు యేమనినఁ గడువాదు
పెక్కుమాఁట లింకనేల పెనఁగేటివేళ

(॥ఏమి॥)
కాఁగిటినీకూటములు కన్న చోటివోటములు
తోఁగిననాతోడిపొందు దొరకు విందు
దాఁగక శ్రీవేంకటేశ తనువు లొక్కట రాసె
కాఁగినకాఁకలు దేరె కందువలు చేరె

(||pallavi||)
emiḍim̐ dalabom̐ta yissī rom̐ta
vemāru nanalenu vĕllaviri nenu

(||emi||)
sĕṁgāvinīmovisĕluvĕllā devi devi
yĕṁgilainasīgāgu yem̐ṭigi nāgu
saṁgadāya naḍu vora sārĕ nela ninnudūra
yiṁgidabunīguṇālu yĕṟim̐gidim̐ jālu

(||emi||)
mŏkkeḍidi yīmŏkku munnīḍisĕlulu pĕkku
tŏkkidŏkki kobānam̐ dosina vola
yikkaḍam̐ dalam̐sarādu yemaninam̐ gaḍuvādu
pĕkkumām̐ṭa liṁkanela pĕnam̐geḍiveḽa

(||emi||)
kām̐giḍinīgūḍamulu kanna soḍivoḍamulu
tom̐ginanādoḍibŏṁdu dŏragu viṁdu
dām̐gaga śhrīveṁkaḍeśha tanuvu lŏkkaḍa rāsĕ
kām̐ginagām̐kalu derĕ kaṁduvalu serĕ