Emidigim jeseve yegasakkelu

ఏమిటికిఁ జేసేవే యెగసక్కేలు
Language

(॥పల్లవి॥)
ఏమిటికిఁ జేసేవే యెగసక్కేలు
కామించిన రమణునిఁ గలయఁగరాదా

(॥॥)
కప్పి నిన్నాతఁడు తమిఁ గాఁగిలించుకొనఁగాను
యిప్పుడు నీవిన్నపము లేమిసేసేవే
ముప్పిరిదప్పికిని నీమోవితేనె లడుగఁగ
అప్పటిఁ బన్నీరేల అందియిచ్చేవే

(॥॥)
సొలసి చక్కఁదనాలు చూచి యాతఁడు చొక్కఁగా
తల దువ్వి తురుము యెందాఁకాఁ బెట్టేవే
కలికి నీచన్నులకుఁ గడు చేయిచాఁచఁగాను
వెలయ నిప్పుడు యేల వీడె మందిచ్చేవే

(॥॥)
శ్రీ వేంకటేశ్వరుఁడు చేరి రతిఁ గూడఁగాను
యీవేళనే పాదములు యేఁటి కొత్తేవే
కావిరి నేకతమునఁ గడు నీతో నవ్వఁగాను
చేవమీరి ఇఁకనేల సిగ్గువడేవే

(||pallavi||)
emiḍigim̐ jeseve yĕgasakkelu
kāmiṁchina ramaṇunim̐ galayam̐garādā

(||||)
kappi ninnādam̐ḍu tamim̐ gām̐giliṁchugŏnam̐gānu
yippuḍu nīvinnabamu lemiseseve
muppiridappigini nīmovidenĕ laḍugam̐ga
appaḍim̐ bannīrela aṁdiyichcheve

(||||)
sŏlasi sakkam̐danālu sūsi yādam̐ḍu sŏkkam̐gā
tala duvvi turumu yĕṁdām̐kām̐ bĕṭṭeve
kaligi nīsannulagum̐ gaḍu seyisām̐sam̐gānu
vĕlaya nippuḍu yela vīḍĕ maṁdichcheve

(||||)
śhrī veṁkaḍeśhvarum̐ḍu seri radim̐ gūḍam̐gānu
yīveḽane pādamulu yem̐ṭi kŏtteve
kāviri negadamunam̐ gaḍu nīdo navvam̐gānu
sevamīri im̐kanela sigguvaḍeve