(॥పల్లవి॥)
ఏమిటికిఁ జలము యెందాఁకా
నాముల తోడుత నగవే యిఁకను
(॥॥)
బలము లేమిటికిఁ బచరించేవే
వలచినదానవు వనితవు
సొలయచు రమణుని సోదింతురటే
అలరి ఇచ్చకములాడుట గాక
(॥॥)
తగవులఁ బెట్టఁగ తగునటవే యిఁక
మగనితోడ పలుమరు నిపుడు
అగడుసేతురా అతని నింతేసి
చిగురుమో వొసఁగి చెలఁగుటగాక
(॥॥)
కూడినవేళను గుట్టుసేతురా
యీడనె శ్రీ వేంకటేశునెడ
ఆడకు వెంగెము లలమేల్మంగవు
వీడెము లంచుక వెలయుటగాక
(||pallavi||)
emiḍigim̐ jalamu yĕṁdām̐kā
nāmula toḍuda nagave yim̐kanu
(||||)
balamu lemiḍigim̐ basariṁcheve
valasinadānavu vanidavu
sŏlayasu ramaṇuni sodiṁturaḍe
alari ichchagamulāḍuḍa gāga
(||||)
tagavulam̐ bĕṭṭam̐ga tagunaḍave yim̐ka
maganidoḍa palumaru nibuḍu
agaḍusedurā adani niṁtesi
sigurumo vŏsam̐gi sĕlam̐guḍagāga
(||||)
kūḍinaveḽanu guṭṭusedurā
yīḍanĕ śhrī veṁkaḍeśhunĕḍa
āḍagu vĕṁgĕmu lalamelmaṁgavu
vīḍĕmu laṁchuga vĕlayuḍagāga