Emidigim dalavamche vela sigguluvadevu

ఏమిటికిఁ దలవంచే వేల సిగ్గులువడేవు
Language

(॥పల్లవి॥)
ఏమిటికిఁ దలవంచే వేల సిగ్గులువడేవు
కామించి వచ్చెఁగాక గాతసేయ వచ్చెనా

(॥॥)
మచ్చిక నీతోఁ జెలి మాటలాడ వచ్చెఁగాక
పచ్చిగాఁ జీఁకటితప్పు పట్టవచ్చెనా
ముచ్చటదీరఁగ నీమోము చూడవచ్చెఁగాక
తెచ్చుకొన్నయాకెతో వాదించవచ్చెనా

(॥॥)
అట్టె నిన్ను వీడె మడుగఁగ వచ్చెఁగాక
దిట్టయై నీసేతలు సోదించవచ్చెనా
నెట్టన నీసేవసేయ నెయ్యముతో వచ్చెఁగాక
గట్టిగా నీనేస్తాలు కాకుసేయ వచ్చెనా

(॥॥)
మిక్కిలి కాఁగిటఁ గూడి మెప్పించవచ్చెఁగాక
కక్కసించి నీపై నద్దికము వచ్చెనా
మొక్కుచు శ్రీ వేంకటేశ మోవి యానవచ్చెఁగాక
పక్కన నాపెను నిన్నుఁ బచ్చి సేయవచ్చెనా

(||pallavi||)
emiḍigim̐ dalavaṁche vela sigguluvaḍevu
kāmiṁchi vachchĕm̐gāga gādaseya vachchĕnā

(||||)
machchiga nīdom̐ jĕli māḍalāḍa vachchĕm̐gāga
pachchigām̐ jīm̐kaḍidappu paṭṭavachchĕnā
muchchaḍadīram̐ga nīmomu sūḍavachchĕm̐gāga
tĕchchugŏnnayāgĕdo vādiṁchavachchĕnā

(||||)
aṭṭĕ ninnu vīḍĕ maḍugam̐ga vachchĕm̐gāga
diṭṭayai nīsedalu sodiṁchavachchĕnā
nĕṭṭana nīsevaseya nĕyyamudo vachchĕm̐gāga
gaṭṭigā nīnestālu kāguseya vachchĕnā

(||||)
mikkili kām̐giḍam̐ gūḍi mĕppiṁchavachchĕm̐gāga
kakkasiṁchi nībai naddigamu vachchĕnā
mŏkkusu śhrī veṁkaḍeśha movi yānavachchĕm̐gāga
pakkana nābĕnu ninnum̐ bachchi seyavachchĕnā