Emidigi veravavu yemta gattuvaayavu

ఏమిటికి వెరవవు యెంత గట్టువాయవు
Language

(॥పల్లవి॥)
ఏమిటికి వెరవవు యెంత గట్టువాయవు
బూమె లింత నేరకుంటే పొద్దెట్టు వేఁగీని

(॥ఏమి॥)
సొలసి నిన్ను నేఁ జూచి చొప్పులెల్లా నెత్తితేను
వలపు చల్లితినంటా వడి నవ్వేవు
తలపోసి నీచేఁతలు తారుకాణ చేసితేను
నలి నిజమాడేనంటా నన్ను మెచ్చేవు

(॥ఏమి॥)
శిరసు ముట్టఁగా, నేను చేత నిన్నుఁ దోసితేను
సరసమాడితినంటా చనవిచ్చేవు
తెరవేసుకొని వొంటిఁ దేఁకువతో నుండితేను
సరవిఁ గూడఁ బిలిచే సన్న లనేవు

(॥ఏమి॥)
దగ్గరఁ గూచుండి నేను తలవంచుకుండితేను
సిగ్గువడివున్నదంటాఁ జెప్పుకొనేవు
యెగ్గులేక శ్రీవేంకటేశ కాఁగిలించుకొంటే
బెగ్గిల నీరతుల మెప్పించితి ననేవు

(||pallavi||)
emiḍigi vĕravavu yĕṁta gaṭṭuvāyavu
būmĕ liṁta neraguṁṭe pŏddĕṭṭu vem̐gīni

(||emi||)
sŏlasi ninnu nem̐ jūsi sŏppulĕllā nĕttidenu
valabu sallidinaṁṭā vaḍi navvevu
talabosi nīsem̐talu tārugāṇa sesidenu
nali nijamāḍenaṁṭā nannu mĕchchevu

(||emi||)
śhirasu muṭṭam̐gā, nenu seda ninnum̐ dosidenu
sarasamāḍidinaṁṭā sanavichchevu
tĕravesugŏni vŏṁṭim̐ dem̐kuvado nuṁḍidenu
saravim̐ gūḍam̐ bilise sanna lanevu

(||emi||)
daggaram̐ gūsuṁḍi nenu talavaṁchuguṁḍidenu
sigguvaḍivunnadaṁṭām̐ jĕppugŏnevu
yĕggulega śhrīveṁkaḍeśha kām̐giliṁchugŏṁṭe
bĕggila nīradula mĕppiṁchidi nanevu