Emidigi vatti simta yekkadivi duhkhamulu

ఏమిటికి వట్టి చింత యెక్కడివి దుఃఖములు
Language

(॥పల్లవి॥)
ఏమిటికి వట్టి చింత యెక్కడివి దుఃఖములు
శ్రీమంతుఁడే మా యరచేత నున్నాఁడు

(॥ఏమి॥)
సకలలోకేశ్వరుఁడు సర్వాంతరాత్మతుఁడు
అకలఁకుఁ డిదివో మా యందు నున్నాఁడు
ప్రకటించి యోలికయై బహు సంపదలై
మొకరిబంధువుఁడై ముందర నున్నాఁడు

(॥ఏమి॥)
పరమపురుషుడు భవరోగవైద్యుఁడు
యిరవైన దేవుఁడు మా యింట నున్నాఁడు
పొరుగు పోరచి భువనరక్షకుఁడై
దరిచేర్చి రక్షించ మాదండ నున్నాఁడు

(॥ఏమి॥)
శ్రీ వేంకటేశుఁడే శ్రీ మహాలక్ష్మీయై
కైవసపు సుఖమునై కల్గి యున్నాఁడు
వేవేలు సుజ్ఞానములై వింత వింత వేడుకలై
దేవుఁడై మాపాలిటఁ దిరమై యున్నాఁడు

(||pallavi||)
emiḍigi vaṭṭi siṁta yĕkkaḍivi duḥkhamulu
śhrīmaṁtum̐ḍe mā yaraseda nunnām̐ḍu

(||emi||)
sagalalogeśhvarum̐ḍu sarvāṁtarātmadum̐ḍu
agalam̐kum̐ ḍidivo mā yaṁdu nunnām̐ḍu
pragaḍiṁchi yoligayai bahu saṁpadalai
mŏgaribaṁdhuvum̐ḍai muṁdara nunnām̐ḍu

(||emi||)
paramaburuṣhuḍu bhavarogavaidyum̐ḍu
yiravaina devum̐ḍu mā yiṁṭa nunnām̐ḍu
pŏrugu porasi bhuvanarakṣhagum̐ḍai
darisersi rakṣhiṁcha mādaṁḍa nunnām̐ḍu

(||emi||)
śhrī veṁkaḍeśhum̐ḍe śhrī mahālakṣhmīyai
kaivasabu sukhamunai kalgi yunnām̐ḍu
vevelu sujñānamulai viṁta viṁta veḍugalai
devum̐ḍai mābāliḍam̐ diramai yunnām̐ḍu