Emidigi vatti neraalemchevu neevu

ఏమిటికి వట్టి నేరాలెంచేవు నీవు
Language

(॥పల్లవి॥)
ఏమిటికి వట్టి నేరాలెంచేవు నీవు
దామెన రతులవేళ తప్పించుకొనేవా

(॥ఏమి॥)
వుబ్బరితనాల నట్టే వూరకేల తిట్టేవు
గుబ్బచన్ను దాఁకితేనే కుమ్మెవోయీనా
గొబ్బునఁ గాఁగిట నీవు కూడేవేళ నిఁక మరి
తబ్బిబ్బుసేసుకొని తప్పించుకొనేవా

(॥ఏమి॥)
యీవల తిరిగిచూచి యేల పంతములాడేవు
మోవి మోవి సోఁకితేనే మోదుకట్టీనా
పూవువలె నిద్దరము పొందులు సేసేటివేళ
తావుదావుల మోవక తప్పించుకొనేవా

(॥ఏమి॥)
ఱట్టుగా నావలపాఱడి సేసే వింతలోనే
గట్టిగాఁ గాఁగిలించితే కళ దాఁకీనా
యిట్టే శ్రీవేంకటేశ యేలితి విప్పటివేళ
దట్టించి యింకా నీవు తప్పించుకొనేవా

(||pallavi||)
emiḍigi vaṭṭi nerālĕṁchevu nīvu
dāmĕna radulaveḽa tappiṁchugŏnevā

(||emi||)
vubbaridanāla naṭṭe vūragela tiṭṭevu
gubbasannu dām̐kidene kummĕvoyīnā
gŏbbunam̐ gām̐giḍa nīvu kūḍeveḽa nim̐ka mari
tabbibbusesugŏni tappiṁchugŏnevā

(||emi||)
yīvala tirigisūsi yela paṁtamulāḍevu
movi movi som̐kidene modugaṭṭīnā
pūvuvalĕ niddaramu pŏṁdulu seseḍiveḽa
tāvudāvula movaga tappiṁchugŏnevā

(||emi||)
ṟaṭṭugā nāvalabāṟaḍi sese viṁtalone
gaṭṭigām̐ gām̐giliṁchide kaḽa dām̐kīnā
yiṭṭe śhrīveṁkaḍeśha yelidi vippaḍiveḽa
daṭṭiṁchi yiṁkā nīvu tappiṁchugŏnevā