Emidigi ninnu doora nemtainanu

ఏమిటికి నిన్ను దూర నెంతైనను
Language

(॥పల్లవి॥)
ఏమిటికి నిన్ను దూర నెంతైనను
యేమరము మా గుట్టు యేమైనను

(॥ఏమి॥)
మచ్చికలు చల్లి చల్లి మాటలదొంతర వెట్టి
యిచ్చకము లాడేమా యెంతనను
కొచ్చి కొచ్చి మాగంభీరగుణ మించ విడి చేమా
యెచ్చి నీవు పదరితే నెంతైనను

(॥ఏమి॥)
సంతవాపు లటు చెప్పి సారెకును నవ్వు నవ్వి
యింతలోనే పైకొనేమా యెంతైనను
వింతదైన్యములు చూపి విరహము గనమంటా
యింతులచేఁ జెప్పించేమా యెంతైనను

(॥ఏమి॥)
చెక్కులు నొక్కి నిన్నుఁ జేరి రతి నలయించి
యిక్కువకు లోఁగేమా యెంతైనను
గక్కున శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
యెక్కడ నీకు వెలితి యెంతైనను

(||pallavi||)
emiḍigi ninnu dūra nĕṁtainanu
yemaramu mā guṭṭu yemainanu

(||emi||)
machchigalu salli salli māḍaladŏṁtara vĕṭṭi
yichchagamu lāḍemā yĕṁtananu
kŏchchi kŏchchi māgaṁbhīraguṇa miṁcha viḍi semā
yĕchchi nīvu padaride nĕṁtainanu

(||emi||)
saṁtavābu laḍu sĕppi sārĕgunu navvu navvi
yiṁtalone paigŏnemā yĕṁtainanu
viṁtadainyamulu sūbi virahamu ganamaṁṭā
yiṁtulasem̐ jĕppiṁchemā yĕṁtainanu

(||emi||)
sĕkkulu nŏkki ninnum̐ jeri radi nalayiṁchi
yikkuvagu lom̐gemā yĕṁtainanu
gakkuna śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
yĕkkaḍa nīgu vĕlidi yĕṁtainanu