ఏమిటికి నింతేసి యింత కోపఁగలనా
(॥పల్లవి॥)
ఏమిటికి నింతేసి యింత కోపఁగలనా
వోముచుఁ దాఁ గలఁడని వుండేదే చాలదా
(॥ఏమిటి॥)
యెగసక్కేలకు నేము యిద్దరమూ దగ్గరతే
తగవు దేరిచేవాఁడు తానే కదే
తెగువలు నెరపఁగా తియ్యనిమాట లాడి
వగపులు దీర్చేటివాఁడు దానే కదవే
(॥ఏమిటి॥)
చయముగ నేను వారు జగడాల నలసితే
దయఁ దలఁచేవాఁడు తానే కదే
నయ మెఱుఁగనిమమ్ము నంటునఁ జుటాలఁ జేసి
ప్రియముచెప్పేటివా డుఁబెరసి తానే కదవే
(॥ఏమిటి॥)
ఆలరి కోపముతోడ నాపె నేను గొసరితే
తాలిమితో నుండేవాఁడు తానే కదే
యీవల శ్రీవేంకటేశుఁ డిటు మమ్ముఁ గలసెను
వాలాయించి పంత మిచ్చేవాఁడు తానే కదవే
(||pallavi||)
emiḍigi niṁtesi yiṁta kobam̐galanā
vomusum̐ dām̐ galam̐ḍani vuṁḍede sāladā
(||emiḍi||)
yĕgasakkelagu nemu yiddaramū daggarade
tagavu derisevām̐ḍu tāne kade
tĕguvalu nĕrabam̐gā tiyyanimāḍa lāḍi
vagabulu dīrseḍivām̐ḍu dāne kadave
(||emiḍi||)
sayamuga nenu vāru jagaḍāla nalaside
dayam̐ dalam̐sevām̐ḍu tāne kade
naya mĕṟum̐ganimammu naṁṭunam̐ juḍālam̐ jesi
priyamusĕppeḍivā ḍum̐bĕrasi tāne kadave
(||emiḍi||)
ālari kobamudoḍa nābĕ nenu gŏsaride
tālimido nuṁḍevām̐ḍu tāne kade
yīvala śhrīveṁkaḍeśhum̐ ḍiḍu mammum̐ galasĕnu
vālāyiṁchi paṁta michchevām̐ḍu tāne kadave