Emidigi maamumdara yemmelellaam joobevu

ఏమిటికి మాముందర యెమ్మెలెల్లాఁ జూపేవు
Language

(॥పల్లవి॥)
ఏమిటికి మాముందర యెమ్మెలెల్లాఁ జూపేవు
నేమూ నీవలె మేలు నెరపఁగఁగలమే

(॥॥)
చక్కనిదాన వౌదువే సణఁగులాఁడి వౌదువే
నిక్కి విభునిఁ గొసర నేరుతువే
దక్కీనే నీ పంతములు తరుణులలోనెల్లా
మక్కువ నాతని నింత మరిగించుకొంటివి

(॥॥)
జవ్వని వౌదువే మంచి జాణకతై వౌదువే
రవ్వసేసి భ్రమయించ రాజవే నీవు
నవ్వు లీడేరెనే నీకు నడుమ నిందరులోన
బువ్వాన నీతని నింత పొందుసేసుకొంటివి

(॥॥)
మేటి వౌదువే అలమేలుమంగ వౌదువే
పాటించి శ్రీ వేంకటేశుఁ బనిగొంటివి
మాటలు చెల్లె నీకు మావంటివారిలోనెల్లా
చాటున మమ్మేలితని చనవు గై కొంటివి

(||pallavi||)
emiḍigi māmuṁdara yĕmmĕlĕllām̐ jūbevu
nemū nīvalĕ melu nĕrabam̐gam̐galame

(||||)
sakkanidāna vauduve saṇam̐gulām̐ḍi vauduve
nikki vibhunim̐ gŏsara neruduve
dakkīne nī paṁtamulu taruṇulalonĕllā
makkuva nādani niṁta marigiṁchugŏṁṭivi

(||||)
javvani vauduve maṁchi jāṇagadai vauduve
ravvasesi bhramayiṁcha rājave nīvu
navvu līḍerĕne nīgu naḍuma niṁdarulona
buvvāna nīdani niṁta pŏṁdusesugŏṁṭivi

(||||)
meḍi vauduve alamelumaṁga vauduve
pāḍiṁchi śhrī veṁkaḍeśhum̐ banigŏṁṭivi
māḍalu sĕllĕ nīgu māvaṁṭivārilonĕllā
sāḍuna mammelidani sanavu gai kŏṁṭivi