Emidigi maadone yegasakkelu

ఏమిటికి మాతోనే యెగసక్కేలు
Language

(॥పల్లవి॥)
ఏమిటికి మాతోనే యెగసక్కేలు
చే ముట్టి యాతని నీవే చెనకఁగరాదా

(॥॥)
మలసి యాతనితోను మాటలాడితినంటాను
వెలఁదిరో నీవేల వెంగమాడేవే
వలచి వచ్చి విభుఁడు వద్దనే కాచుకున్నాఁడు
చలము లాతనితోనే సాదించరాదా

(॥॥)
ననుపున నాతనితో నవ్వులు నవ్వితినంటా
కనుఁగొని నీ వెంత కాఁతాళించేవే
చనవువ నాతఁడు చన్ను లంటుకున్నాఁడు
తనిసి యాతని నీవే తప్పులెంచరాదా

(॥॥)
కందువ శ్రీ వేంకటేశుకాఁగిట నుందాననంటా
చెంది కాలుదొక్కి యేల చెనురించేవే
మందెమేళాన నీతఁడే మనసిచ్చుకున్నాఁడు
పొందు సేసుక నీవును పొగడఁగరాదా

(||pallavi||)
emiḍigi mādone yĕgasakkelu
se muṭṭi yādani nīve sĕnagam̐garādā

(||||)
malasi yādanidonu māḍalāḍidinaṁṭānu
vĕlam̐diro nīvela vĕṁgamāḍeve
valasi vachchi vibhum̐ḍu vaddane kāsugunnām̐ḍu
salamu lādanidone sādiṁcharādā

(||||)
nanubuna nādanido navvulu navvidinaṁṭā
kanum̐gŏni nī vĕṁta kām̐tāḽiṁcheve
sanavuva nādam̐ḍu sannu laṁṭugunnām̐ḍu
tanisi yādani nīve tappulĕṁcharādā

(||||)
kaṁduva śhrī veṁkaḍeśhugām̐giḍa nuṁdānanaṁṭā
sĕṁdi kāludŏkki yela sĕnuriṁcheve
maṁdĕmeḽāna nīdam̐ḍe manasichchugunnām̐ḍu
pŏṁdu sesuga nīvunu pŏgaḍam̐garādā