Emidigi doorevu yeravulavaanivale

ఏమిటికి దూరేవు యెరవులవానివలె
Language

(॥పల్లవి॥)
ఏమిటికి దూరేవు యెరవులవానివలె
యీ మోహమే నిజమైతే నింటికి రారాదా

(॥॥)
మంతనము గాకుండఁగా మాటలాడదాయఁ గాని
పంతముగాదు నీతోఁ బడఁతికిని
సంతజాణతనమౌను సబలోన నాడితేను
ఇంత గలవాఁడవైతే నింటికి రారాదా

(॥॥)
సిగ్గులు నిండుకొనఁగ చేరి మెక్కదాయఁగాని
వెగ్గళించి కాదుసుమ్మీ వెలఁది నీతో
అగ్గమై సందడిలోననైతే గొల్ల దోమటౌను
యెగ్గులేనివాఁడవైతే నింటికి రారాదా

(॥॥)
కడుఁబరవశములుగాఁగా నవ్వదాయఁగాని
గడుసుగా దలమేల్మంగ నియ్యెడను
అడరుచు శ్రీ వేంకటాధిప కూడితి విట్టె
యెడయ కెప్పుడు నిట్టె ఇంటికి రారాదా

(||pallavi||)
emiḍigi dūrevu yĕravulavānivalĕ
yī mohame nijamaide niṁṭigi rārādā

(||||)
maṁtanamu gāguṁḍam̐gā māḍalāḍadāyam̐ gāni
paṁtamugādu nīdom̐ baḍam̐tigini
saṁtajāṇadanamaunu sabalona nāḍidenu
iṁta galavām̐ḍavaide niṁṭigi rārādā

(||||)
siggulu niṁḍugŏnam̐ga seri mĕkkadāyam̐gāni
vĕggaḽiṁchi kādusummī vĕlam̐di nīdo
aggamai saṁdaḍilonanaide gŏlla domaḍaunu
yĕggulenivām̐ḍavaide niṁṭigi rārādā

(||||)
kaḍum̐baravaśhamulugām̐gā navvadāyam̐gāni
gaḍusugā dalamelmaṁga niyyĕḍanu
aḍarusu śhrī veṁkaḍādhiba kūḍidi viṭṭĕ
yĕḍaya kĕppuḍu niṭṭĕ iṁṭigi rārādā