ఏమిటికి బుద్దిచెప్పేమే యిఁక నీకు
(॥పల్లవి॥)
ఏమిటికి బుద్దిచెప్పేమే యిఁక నీకు
కామించి యాతని కిచ్చకములే ఆడేవు
(॥ఏమి॥)
ముంచి మోహపువారికి మొగమోటలేకాని
యించుకంతనిష్టూరమూ నెఱఁగరు
చంచుల నెడసితేను సాహసములేకాని
పంచలఁ దాలిములను పట్టిలేరు మనసు
(॥ఏమి॥)
ననిచినవారికి నగవులే వచ్చుఁగాని
పెనఁగినకోపము పెంచరు
తనివోక వుండితేను తమకమే హెచ్చుఁగాని
గునిసి వేసటలకు గుఱిగారు
(॥ఏమి॥)
కూటినట్టివారికి కోరికలే మించుఁగాని
వాడుదేరినకాఁగిలి వదలరు
వీడెమిచ్చి కూడెను శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్ను
వేడుకలు మీవలెనే విడువరు లోకులు
(||pallavi||)
emiḍigi buddisĕppeme yim̐ka nīgu
kāmiṁchi yādani kichchagamule āḍevu
(||emi||)
muṁchi mohabuvārigi mŏgamoḍalegāni
yiṁchugaṁtaniṣhṭūramū nĕṟam̐garu
saṁchula nĕḍasidenu sāhasamulegāni
paṁchalam̐ dālimulanu paṭṭileru manasu
(||emi||)
nanisinavārigi nagavule vachchum̐gāni
pĕnam̐ginagobamu pĕṁcharu
tanivoga vuṁḍidenu tamagame hĕchchum̐gāni
gunisi vesaḍalagu guṟigāru
(||emi||)
kūḍinaṭṭivārigi korigale miṁchum̐gāni
vāḍuderinagām̐gili vadalaru
vīḍĕmichchi kūḍĕnu śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnu
veḍugalu mīvalĕne viḍuvaru logulu