Emidige selulaala yemta nannu sodimchere

ఏమిటికే చెలులాల యెంత నన్ను సోదించేరే
Language

(॥పల్లవి॥)
ఏమిటికే చెలులాల యెంత నన్ను సోదించేరే
ప్రేమపు నా రమణుని బెడఁ బాయనోపనే

(॥ఏమి॥)
మొగమాట గలిగితే మోవ నెంతాడినాను
నగవులే సెలవి నున్నతి మించును
తగవే నడిపేనంటే తప్పుఁదోవకుఁ దీసితే
వొగరై తోఁచుఁగాని వొడఁబాటై వుండదు

(॥ఏమి॥)
చుట్టరికమైనచోట సొట్లెంత మోపినాను
మట్టులేని సంతోషమే మతిఁ దోచును
అట్టె తాలిమి గలితే ఆయములు నాటించినా
బుట్టుకే లోనౌఁగాని గుణము విడువదు

(॥ఏమి॥)
కూడివున్నవేళను గురుతు లెన్ని చేసినా
వేడుకలైవుండుఁగాని వెత రేఁగదు
యీడనె శ్రీవేంకటేశుఁ డేలినాఁడు నన్ను నేఁడు
జోడుగూడే వుండుగాని సూటిదప్ప దెపుడు

(||pallavi||)
emiḍige sĕlulāla yĕṁta nannu sodiṁchere
premabu nā ramaṇuni bĕḍam̐ bāyanobane

(||emi||)
mŏgamāḍa galigide mova nĕṁtāḍinānu
nagavule sĕlavi nunnadi miṁchunu
tagave naḍibenaṁṭe tappum̐dovagum̐ dīside
vŏgarai tom̐sum̐gāni vŏḍam̐bāḍai vuṁḍadu

(||emi||)
suṭṭarigamainasoḍa sŏṭlĕṁta mobinānu
maṭṭuleni saṁtoṣhame madim̐ dosunu
aṭṭĕ tālimi galide āyamulu nāḍiṁchinā
buṭṭuge lonaum̐gāni guṇamu viḍuvadu

(||emi||)
kūḍivunnaveḽanu gurudu lĕnni sesinā
veḍugalaivuṁḍum̐gāni vĕda rem̐gadu
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍelinām̐ḍu nannu nem̐ḍu
joḍugūḍe vuṁḍugāni sūḍidappa dĕbuḍu