Emidigayya neevu nannela nishtoorim jesevu

ఏమిటికయ్య నీవు నన్నేల నిష్టూరిఁ జేసేవు
Language

(॥పల్లవి॥)
ఏమిటికయ్య నీవు నన్నేల నిష్టూరిఁ జేసేవు
చే ముట్టి నీ పాదాల సేవ సేసేదానను

(॥ఏమి॥)
ఆపెవద్ద నుండఁగా అద్దలించనోపుదునా
దాపులను మొగమోటదాన నేను
కోపమెంత గలిగినా గురి నీపైఁ జూపుదువా
తీపుగా నీకు నామోవితేనె వూసేదానను

(॥ఏమి॥)
ఇంతి నిన్నుఁ గూడుండఁగ యెడరు నేఁ జేతునా
చెంత దోసాలకు వెఱచినదానను
పంతపుదాన నేనైతే బలిమి నీకు జూపేనా
యెంతైన నీవద్ద నిచ్చలాడేదానను

(॥ఏమి॥)
సవతై యింట నుండఁగ జగడాలడుతునా
కవగూడి బలఁగము గలదానను
ఇవల శ్రీ వేంకటేశ ఇట్టె నన్నుఁ గలసితి
తవిలి నీకు నిట్టె తమకించేదానను

(||pallavi||)
emiḍigayya nīvu nannela niṣhṭūrim̐ jesevu
se muṭṭi nī pādāla seva sesedānanu

(||emi||)
ābĕvadda nuṁḍam̐gā addaliṁchanobudunā
dābulanu mŏgamoḍadāna nenu
kobamĕṁta galiginā guri nībaim̐ jūbuduvā
tībugā nīgu nāmovidenĕ vūsedānanu

(||emi||)
iṁti ninnum̐ gūḍuṁḍam̐ga yĕḍaru nem̐ jedunā
sĕṁta dosālagu vĕṟasinadānanu
paṁtabudāna nenaide balimi nīgu jūbenā
yĕṁtaina nīvadda nichchalāḍedānanu

(||emi||)
savadai yiṁṭa nuṁḍam̐ga jagaḍālaḍudunā
kavagūḍi balam̐gamu galadānanu
ivala śhrī veṁkaḍeśha iṭṭĕ nannum̐ galasidi
tavili nīgu niṭṭĕ tamagiṁchedānanu