ఏమిటి వంక సుఖము యెంచి చెప్పగా వచ్చు
(॥పల్లవి॥)
ఏమిటి వంక సుఖము యెంచి చెప్పగా వచ్చు
కామించక మానుటే అక్షయసుఖము గాకా
(॥ఏమిటి॥)
వెలలేని పదార్థాలు వేడుకవలెనే వచ్చు
చెలఁగి నాశమునొంది చింత వుట్టించు
పలు లంపటము లెల్లా పనికివచ్చినట్టుండి
తలఁచినట్టు వడక తడఁబాటు సేసును
(॥ఏమిటి॥)
సరి నాహారనిద్రలు సహజమువలె నుండి
అరుదై వేళలఁ దప్పి యలయించును
పరుల సంగాతములు భక్తితోనే వొనగూడి
పెరిగి తగులములై పెనఁపులఁ బెట్టును
(॥ఏమిటి॥)
వుపకారి దానధర్మా లొడఁ బాట్లై మించి
విపరీతమై బలసి వేసరింపించు
యెపుడు శ్రీవేంకటేశ యివి యెల్లా నీ చేష్ఠలు
వుపమించి తెలిసితే వొద్దికతో నుందును
(||pallavi||)
emiḍi vaṁka sukhamu yĕṁchi sĕppagā vachchu
kāmiṁchaga mānuḍe akṣhayasukhamu gāgā
(||emiḍi||)
vĕlaleni padārdhālu veḍugavalĕne vachchu
sĕlam̐gi nāśhamunŏṁdi siṁta vuṭṭiṁchu
palu laṁpaḍamu lĕllā panigivachchinaṭṭuṁḍi
talam̐sinaṭṭu vaḍaga taḍam̐bāḍu sesunu
(||emiḍi||)
sari nāhāranidralu sahajamuvalĕ nuṁḍi
arudai veḽalam̐ dappi yalayiṁchunu
parula saṁgādamulu bhaktidone vŏnagūḍi
pĕrigi tagulamulai pĕnam̐pulam̐ bĕṭṭunu
(||emiḍi||)
vubagāri dānadharmā lŏḍam̐ bāṭlai miṁchi
vibarīdamai balasi vesariṁpiṁchu
yĕbuḍu śhrīveṁkaḍeśha yivi yĕllā nī seṣhṭhalu
vubamiṁchi tĕliside vŏddigado nuṁdunu