Emidi kemi sesidi nissee nenu

ఏమిటి కేమి సేసితి నిస్సీ నేను
Language

(॥పల్లవి॥)
ఏమిటి కేమి సేసితి నిస్సీ నేను
యీ మతకము ముందరి కెఱుకాయ నాకు

(॥ఏమిటి॥)
అద్దో యెవ్వతెనో నీ వండఁ బెట్టుకొని యుండి
పెద్దరికానకు నన్నుఁ బిలిపించితి
కద్దు లేరా నీవంక కల్ల నీవు దొరవంటా
వొద్దికివచ్చినతప్పువొక్కటే నాకు

(॥ఏమిటి॥)
చెల్లఁబో నాచేత నాకు చేరి మడిపించుకొని
వొల్లనే యాకె కిచ్చితి వోరి నీవు
చెల్లులేరా నీ వేమి సేతువు నా నేర మింతే
మొల్లమి వీడె మిచ్చుటే మోస మాయ నాకు

(॥ఏమిటి॥)
పో పో నాతో బొంకి పొలఁతిఁ దెరలో దాఁచి
పై పై న న్నిటు గూడి భ్రమయించితి
బాపుర శ్రీవేంకటేశ పంతగాఁడ నీ మోవి
తీపులు మరిగినదె దృష్టమాయ నాకు

(||pallavi||)
emiḍi kemi sesidi nissī nenu
yī madagamu muṁdari kĕṟugāya nāgu

(||emiḍi||)
addo yĕvvadĕno nī vaṁḍam̐ bĕṭṭugŏni yuṁḍi
pĕddarigānagu nannum̐ bilibiṁchidi
kaddu lerā nīvaṁka kalla nīvu dŏravaṁṭā
vŏddigivachchinadappuvŏkkaḍe nāgu

(||emiḍi||)
sĕllam̐bo nāseda nāgu seri maḍibiṁchugŏni
vŏllane yāgĕ kichchidi vori nīvu
sĕllulerā nī vemi seduvu nā nera miṁte
mŏllami vīḍĕ michchuḍe mosa māya nāgu

(||emiḍi||)
po po nādo bŏṁki pŏlam̐tim̐ dĕralo dām̐si
pai pai na nniḍu gūḍi bhramayiṁchidi
bābura śhrīveṁkaḍeśha paṁtagām̐ḍa nī movi
tībulu mariginadĕ dṛṣhṭamāya nāgu