Emidappiboya neegu nemdaru leru sadulu

ఏమిదప్పిపోయ నీకు నెందరు లేరు సతులు
Language

(॥పల్లవి॥)
ఏమిదప్పిపోయ నీకు నెందరు లేరు సతులు
నేమముతో నున్నదాన నెరవేర్చరాదా

(॥ఏమి॥)
మగువా నీవును నుండి మాటలు నన్నాడించేవు
యెగసక్కేలాడఁగా నీ వేముందువో
జగడాల కోపను చాయసేసుకొని నేను
వొగి నూరకున్న దాన నుండనీరాదా

(॥ఏమి॥)
పడఁతి నీకుండఁగా నాపయ్యెదకొంగు వట్టేవు
యెడసి చేత దొబ్బఁగా నేమందువో
కడుంగోప మాఁపలేక గక్కన గుట్టుసేసుక
వొడికాన నున్నదాన నుండనీరాదా

(॥ఏమి॥)
దక్కి యాపెఁ గూడుండి తడవేవు నన్నప్పటి
యెక్కడికైనా రమ్మంటే నేమందువో
ఇక్కడ శ్రీవేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
వుక్కుమీరి వున్నదాన నుండనీరాదా

(||pallavi||)
emidappiboya nīgu nĕṁdaru leru sadulu
nemamudo nunnadāna nĕraversarādā

(||emi||)
maguvā nīvunu nuṁḍi māḍalu nannāḍiṁchevu
yĕgasakkelāḍam̐gā nī vemuṁduvo
jagaḍāla kobanu sāyasesugŏni nenu
vŏgi nūragunna dāna nuṁḍanīrādā

(||emi||)
paḍam̐ti nīguṁḍam̐gā nābayyĕdagŏṁgu vaṭṭevu
yĕḍasi seda dŏbbam̐gā nemaṁduvo
kaḍuṁgoba mām̐palega gakkana guṭṭusesuga
vŏḍigāna nunnadāna nuṁḍanīrādā

(||emi||)
dakki yābĕm̐ gūḍuṁḍi taḍavevu nannappaḍi
yĕkkaḍigainā rammaṁṭe nemaṁduvo
ikkaḍa śhrīveṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi
vukkumīri vunnadāna nuṁḍanīrādā