Emidam gadama yimka haridaasulagu

ఏమిటఁ గడమ యిఁక హరిదాసులకు
Language

(॥పల్లవి॥)
ఏమిటఁ గడమ యిఁక హరిదాసులకు
కామధేనువువంటి ఘనముక్తి గలిగె

(॥ఏమిట॥)
భగవన్నామ నిజపారిజాతము గలుగ
గగనఁపు మా కోరికలు ఫలించె
జగదేక పతిరూప చంద్రచంద్రికలు గలుగ
మొగిఁ జకోరపునేత్రములు తనవిఁబొందె

(॥ఏమిట॥)
పరమాత్మ చింతనపు భానుఁ డుదయించఁగా
సరుస మా చిత్తజలజంబు లలరే
హరికథాశ్రుతి వసంతాగమము చెలఁగఁగా
వరుసతో విజ్ఞాన వనమెల్ల ననిచె

(॥ఏమిట॥)
చాల శ్రీ వేంకటేశ స్పరుశవేధిచే
కాలజన్మపు టినుము కనక మాయ
వల నాతని కృపాజాలజలనిధి చేత
ఆలోల భక్తియను నమృతంబు వొడమె

(||pallavi||)
emiḍam̐ gaḍama yim̐ka haridāsulagu
kāmadhenuvuvaṁṭi ghanamukti galigĕ

(||emiḍa||)
bhagavannāma nijabārijādamu galuga
gaganam̐pu mā korigalu phaliṁchĕ
jagadega padirūba saṁdrasaṁdrigalu galuga
mŏgim̐ jagorabunetramulu tanavim̐bŏṁdĕ

(||emiḍa||)
paramātma siṁtanabu bhānum̐ ḍudayiṁcham̐gā
sarusa mā sittajalajaṁbu lalare
harigathāśhrudi vasaṁtāgamamu sĕlam̐gam̐gā
varusado vijñāna vanamĕlla nanisĕ

(||emiḍa||)
sāla śhrī veṁkaḍeśha sparuśhavedhise
kālajanmabu ṭinumu kanaga māya
vala nādani kṛpājālajalanidhi seda
ālola bhaktiyanu namṛtaṁbu vŏḍamĕ