ఏమిటఁ దక్కున నాకు యెదలోని భావరతి
(॥పల్లవి॥)
ఏమిటఁ దక్కున నాకు యెదలోని భావరతి
కామించి మేను మేను గలయదు గాని
(॥ఏమిట॥)
తలఁపు లోపల నుండు దగ్గరి నీ రూపమ
పిలిచితేఁ బలుకని వెలితే కాని
కలసినట్ల నుండు కలలోన నీరతి
తెలిసినప్పుడు గుండె దిగులొందుఁ గాని
(॥ఏమిట॥)
మాటలాడిన ట్లుండు మరిగి నీపై తవి
గాటమై వినరాని దొక్కటే కాని
నాటినట్లనే వుండు నవ్వుల నీచూపు నాపె
జూటరి నీ కిదే చెప్పి చూపరాదు గాని
(॥ఏమిట॥)
నిద్దిరించిన ట్లుండు నీ కౌఁగిటిలోనిసొంపు
పొద్దుగుంకుఁ బొడపులు పోదు గాని
వొద్దనే శ్రీవేంకటేశ వొక్క టైతి నింతలోనే
పెద్దరికమే నాకు పెనగొనీఁ గాని
(||pallavi||)
emiḍam̐ dakkuna nāgu yĕdaloni bhāvaradi
kāmiṁchi menu menu galayadu gāni
(||emiḍa||)
talam̐pu lobala nuṁḍu daggari nī rūbama
pilisidem̐ balugani vĕlide kāni
kalasinaṭla nuṁḍu kalalona nīradi
tĕlisinappuḍu guṁḍĕ digulŏṁdum̐ gāni
(||emiḍa||)
māḍalāḍina ṭluṁḍu marigi nībai tavi
gāḍamai vinarāni dŏkkaḍe kāni
nāḍinaṭlane vuṁḍu navvula nīsūbu nābĕ
jūḍari nī kide sĕppi sūbarādu gāni
(||emiḍa||)
niddiriṁchina ṭluṁḍu nī kaum̐giḍilonisŏṁpu
pŏdduguṁkum̐ bŏḍabulu podu gāni
vŏddane śhrīveṁkaḍeśha vŏkka ṭaidi niṁtalone
pĕddarigame nāgu pĕnagŏnīm̐ gāni