ఏమిటాఁ బోరాదు దేహి కిందిరానాథుఁడే
(॥పల్లవి॥)
ఏమిటాఁ బోరాదు దేహి కిందిరానాథుఁడే
ఆముకొ నితని శరణనుటే వుపాయము
(॥ఏమి॥)
అట్టె కోపగించ నంటేనా నాజ్ఞ నడవదు
పట్టి శిక్షించే నంటే పాపము హింస
తొట్టి యేమీ నొల్ల నంటే తోయదు సంసారము
కట్టు కొంటే బంధము మోక్షమునకు దూరము
(॥ఏమి॥)
వొకరి రక్షీంచఁబోతే నొకరి కపకారము
సకలము మానితేను జన్మము వృధా
ఆకట దానము సేసే నంటే ధనము లేదు
సుకరపు ధనకాంక్ష సుజ్ఞానరహితము
(॥ఏమి॥)
తనువు పోషించనంటే తగులు నింద్రియములు
ఘనవిరక్తుఁడైతే లోకము మెచ్చదు
మనసు గెలిచేనంటే మర్మము శ్రీవేంకటేశుఁ
డొనర వివేకించక వుడుగుదు మదము
(||pallavi||)
emiḍām̐ borādu dehi kiṁdirānāthum̐ḍe
āmugŏ nidani śharaṇanuḍe vubāyamu
(||emi||)
aṭṭĕ kobagiṁcha naṁṭenā nājña naḍavadu
paṭṭi śhikṣhiṁche naṁṭe pābamu hiṁsa
tŏṭṭi yemī nŏlla naṁṭe toyadu saṁsāramu
kaṭṭu kŏṁṭe baṁdhamu mokṣhamunagu dūramu
(||emi||)
vŏgari rakṣhīṁcham̐bode nŏgari kabagāramu
sagalamu mānidenu janmamu vṛdhā
āgaḍa dānamu sese naṁṭe dhanamu ledu
sugarabu dhanagāṁkṣha sujñānarahidamu
(||emi||)
tanuvu poṣhiṁchanaṁṭe tagulu niṁdriyamulu
ghanaviraktum̐ḍaide logamu mĕchchadu
manasu gĕlisenaṁṭe marmamu śhrīveṁkaḍeśhum̐
ḍŏnara vivegiṁchaga vuḍugudu madamu