ఏమిబాఁతి నేము నీకు యేల తడవేవు మమ్ము
(॥పల్లవి॥)
ఏమిబాఁతి నేము నీకు యేల తడవేవు మమ్ము
కాముని దీములమైన కాంతలము
(॥ఏమి॥)
వాసులకు నొడిగట్టి వంతులకుఁ జేయిచాఁచి
ఆసలనే చెలఁగేటియంగనలము
సేసలు మీఁదటఁ జల్లి సిగ్గులనేపొరలేటి-
మూసినముత్యతాలు వంటిముగుదలము
(॥ఏమి॥)
చిమ్ముఁజూపులను జూచి చిత్తములోఁదలఁచేతి
వుమ్మగిలువలపులు వువిదలము
తమ్మిమోము విచ్చి నవ్వి తమకించి పెనఁగేటి-
కుమ్మరింపుఁగోరికల కోమలులము
(॥ఏమి॥)
అంకెల గుబ్బలనొత్తి అంతలోనే వేఁడుకొనే
కొంకుఁగొసరెఱఁగనికొమ్మలము
పొంకాన శ్రీవేంకటేశ పొదిగి నన్నేలితివి
కంకణముగట్టుకొన్న కామినులము
(||pallavi||)
emibām̐ti nemu nīgu yela taḍavevu mammu
kāmuni dīmulamaina kāṁtalamu
(||emi||)
vāsulagu nŏḍigaṭṭi vaṁtulagum̐ jeyisām̐si
āsalane sĕlam̐geḍiyaṁganalamu
sesalu mīm̐daḍam̐ jalli siggulanebŏraleḍi-
mūsinamutyadālu vaṁṭimugudalamu
(||emi||)
simmum̐jūbulanu jūsi sittamulom̐dalam̐sedi
vummagiluvalabulu vuvidalamu
tammimomu vichchi navvi tamagiṁchi pĕnam̐geḍi-
kummariṁpum̐gorigala komalulamu
(||emi||)
aṁkĕla gubbalanŏtti aṁtalone vem̐ḍugŏne
kŏṁkum̐gŏsarĕṟam̐ganigŏmmalamu
pŏṁkāna śhrīveṁkaḍeśha pŏdigi nannelidivi
kaṁkaṇamugaṭṭugŏnna kāminulamu