ఏమి యీడువెట్టుకొనే వింతికి నీకు
(॥పల్లవి॥)
ఏమి యీడువెట్టుకొనే వింతికి నీకు
సాముల రతుల నీతో సరిదూఁగునయ్యా
(॥ఏమి॥)
నివే మన్నించితేను నెలఁత నీకంటెను
యేవలా వీసమంత యెక్కుడయ్యా
భావించి నీ వాపెపాదాలకు మొక్కితేన
ఆవేళ నేలికసాని యౌవయ్యా
(॥ఏమి॥)
నీపాదము చాఁచితేనునెలఁత నీకంటెను
యేపున నిన్ను మోఁచిన దెక్కుడయ్యా
చేపట్టి నీ వాపెచెప్పినట్టువినేయందు
కోపగించకు నీ కాపె గురువయ్యా
(॥ఏమి॥)
నీవలపు గలిగితేను నిన్నుఁగూడి చొక్కించీ
యీవిద్యలనన్నిటాను యొక్కుడయ్యా
వో వోయి శ్రీ వేంకటేశ వురమెక్కెఁగనక నీ
దేవులునీపాలింటి దేవరయ్యా
(||pallavi||)
emi yīḍuvĕṭṭugŏne viṁtigi nīgu
sāmula radula nīdo saridūm̐gunayyā
(||emi||)
nive manniṁchidenu nĕlam̐ta nīgaṁṭĕnu
yevalā vīsamaṁta yĕkkuḍayyā
bhāviṁchi nī vābĕbādālagu mŏkkidena
āveḽa neligasāni yauvayyā
(||emi||)
nībādamu sām̐sidenunĕlam̐ta nīgaṁṭĕnu
yebuna ninnu mom̐sina dĕkkuḍayyā
sebaṭṭi nī vābĕsĕppinaṭṭuvineyaṁdu
kobagiṁchagu nī kābĕ guruvayyā
(||emi||)
nīvalabu galigidenu ninnum̐gūḍi sŏkkiṁchī
yīvidyalananniḍānu yŏkkuḍayyā
vo voyi śhrī veṁkaḍeśha vuramĕkkĕm̐ganaga nī
devulunībāliṁṭi devarayyā