Emi vinnavimchemu yemdaamkaa neegu

ఏమి విన్నవించేము యెందాఁకా నీకు
Language

(॥పల్లవి॥)
ఏమి విన్నవించేము యెందాఁకా నీకు
నీమనసునఁ గలట్టు నెలఁతను గావుము

(॥॥)
పంతగాఁడ వౌదువయ్య పడఁతి నింతసేసేవు
ఇంతకీర్తి గట్టుకొంటి విప్పుడు నీవు
మంతనానఁ జెలువెల్లా మంచివాఁడవని నిన్ను
వంతులకుఁ బొగడేరు వాడలవాడలను

(॥॥)
బలువుఁడ వౌదువయ్య బయలీఁదించితి వింత
చల మీడేర్చుకొంటివి సాదువలెనె
సులభాననే నీకీసుకృతము చేరెను
నలుగడ నవ్వేరు నమ్మినట్టివారలు

(॥॥)
నిరతపుజాణవయ్యా నేఁ డింటికి విచ్చేసి
గరిమఁ గూడితి వీకెఁ గరుణించి
సిరుల శ్రీ వేంకటేశ చేఁతలు చందము లాయె
ఆరుదుగ మెచ్చేరు అందరు నీకతలు

(||pallavi||)
emi vinnaviṁchemu yĕṁdām̐kā nīgu
nīmanasunam̐ galaṭṭu nĕlam̐tanu gāvumu

(||||)
paṁtagām̐ḍa vauduvayya paḍam̐ti niṁtasesevu
iṁtagīrdi gaṭṭugŏṁṭi vippuḍu nīvu
maṁtanānam̐ jĕluvĕllā maṁchivām̐ḍavani ninnu
vaṁtulagum̐ bŏgaḍeru vāḍalavāḍalanu

(||||)
baluvum̐ḍa vauduvayya bayalīm̐diṁchidi viṁta
sala mīḍersugŏṁṭivi sāduvalĕnĕ
sulabhānane nīgīsukṛtamu serĕnu
nalugaḍa navveru namminaṭṭivāralu

(||||)
niradabujāṇavayyā nem̐ ḍiṁṭigi vichchesi
garimam̐ gūḍidi vīgĕm̐ garuṇiṁchi
sirula śhrī veṁkaḍeśha sem̐talu saṁdamu lāyĕ
āruduga mĕchcheru aṁdaru nīgadalu