Emi vinnavimchemu yemdaamkaa needonu

ఏమి విన్నవించేము యెందాఁకా నీతోను
Language

(॥పల్లవి॥)
ఏమి విన్నవించేము యెందాఁకా నీతోను
నాలి(ము?) సేయకింతటను నవ్వు నవ్వవయ్యా

(॥ఏమి॥)
వలపులు తలు(ల?) చూపె వనిత కుచములను
బలు విరహపు వేళ పయ్యెదెడలి
చలివాసె సిగ్గులెల్ల జవ్వనమదమునను
తెలిఁగన్నులను సతిదిక్కుఁజూడవయ్యా

(॥ఏమి॥)
వయసు దైలువారె వనిత నెఱిఁగురుల
రయమునఁ గాఁకలెల్ల రారాఁపులె(లై?)
ప్రియమైన తేనెపండు బేఁటులెత్తీ నూర్వులను
దయతోడ నీ యింతిదండ చేరవయ్యా

(॥ఏమి॥)
వన్నెలు తళుకుచూపె వనితమొగమునను
యెన్న శ్రీ వేంకటేశ నీవిట్టె కూడఁగా
సన్నపు జెమటలను జడివట్టి జాలువారె
కన్నియ కిటువలెనే కపురమీవయ్యా

(||pallavi||)
emi vinnaviṁchemu yĕṁdām̐kā nīdonu
nāli(mu?) seyagiṁtaḍanu navvu navvavayyā

(||emi||)
valabulu talu(la?) sūbĕ vanida kusamulanu
balu virahabu veḽa payyĕdĕḍali
salivāsĕ siggulĕlla javvanamadamunanu
tĕlim̐gannulanu sadidikkum̐jūḍavayyā

(||emi||)
vayasu dailuvārĕ vanida nĕṟim̐gurula
rayamunam̐ gām̐kalĕlla rārām̐pulĕ(lai?)
priyamaina tenĕbaṁḍu bem̐ṭulĕttī nūrvulanu
dayadoḍa nī yiṁtidaṁḍa seravayyā

(||emi||)
vannĕlu taḽugusūbĕ vanidamŏgamunanu
yĕnna śhrī veṁkaḍeśha nīviṭṭĕ kūḍam̐gā
sannabu jĕmaḍalanu jaḍivaṭṭi jāluvārĕ
kanniya kiḍuvalĕne kaburamīvayyā