Emi vinnavimchemu imkaa neegu

ఏమి విన్నవించేము ఇంకా నీకు
Language

(॥పల్లవి॥)
ఏమి విన్నవించేము ఇంకా నీకు
కామునిఁ గన్నతండ్రివి కరుణించవయ్యా

(॥ఏమి॥)
వేమరుఁ దరుణిమీఁద వెల్లావిరి సేసేవు
కాముని గరిడిలోనికాఁతాళము
గోమున నీసుద్దులకు గొల్లెత లెట్టోరిచిరో
గామిడివిద్యలకెల్లా ఘనుఁడవుగావా

(॥ఏమి॥)
పొనుఁగక వొకమాఁటే పోగులుగాఁ బోసేవు
వనితమీఁదటను జవ్వనమదము
యెనసి పదారువేల నెంతయెలఇంచితివో
వినుపైనయాసోదము నీసొమ్మేకాదా

(॥ఏమి॥)
బత్తితోడ సేసలుగా పడఁతిపైఁజల్లేవు
చిత్తములోపలఁ బులిసినగజరు
యిత్తల శ్రీవేంకటేశ యింతి నిన్నెట్టు కూడెనో
వుత్తముఁడ నీపనుల కొక్కఁడవే నీవు

(||pallavi||)
emi vinnaviṁchemu iṁkā nīgu
kāmunim̐ gannadaṁḍrivi karuṇiṁchavayyā

(||emi||)
vemarum̐ daruṇimīm̐da vĕllāviri sesevu
kāmuni gariḍilonigām̐tāḽamu
gomuna nīsuddulagu gŏllĕda lĕṭṭorisiro
gāmiḍividyalagĕllā ghanum̐ḍavugāvā

(||emi||)
pŏnum̐gaga vŏgamām̐ṭe pogulugām̐ bosevu
vanidamīm̐daḍanu javvanamadamu
yĕnasi padāruvela nĕṁtayĕla̮iṁchidivo
vinubainayāsodamu nīsŏmmegādā

(||emi||)
battidoḍa sesalugā paḍam̐tibaim̐jallevu
sittamulobalam̐ bulisinagajaru
yittala śhrīveṁkaḍeśha yiṁti ninnĕṭṭu kūḍĕno
vuttamum̐ḍa nībanula kŏkkam̐ḍave nīvu