ఏమి విన్నపాలు సేసే రెందాఁకా నాతనితోడ
(॥పల్లవి॥)
ఏమి విన్నపాలు సేసే రెందాఁకా నాతనితోడ
తా మన్నించిన మన్నన తా నెరఁగఁడా
(॥ఏమి॥)
వలె నని నన్ను నింతవలపంచినట్టివాఁడు
తలఁచినప్పుడె రాఁదా నెరఁగఁడా
చలి వాపి తనపొందుచవులు చూపినవాఁడు
తలఁగ కామీఁదిమాట తా నెరఁగడా
(॥ఏమి॥)
నగి నాతో నేకతాన నమ్మిక లిచ్చినవాఁడు
తగ నాకోప మోరువఁదా నెరఁగఁడా
పగటుతో నన్నుఁ దొల్లి బలిమిసేసినవాఁడు
తగవు లన్నీ నడపఁ దా నెరఁగఁడా
(॥ఏమి॥)
చెనకి నాసిగ్గు వీడఁ జెయిచాఁచినట్టివాఁడు
తనివిఁ బొందించ నన్నుఁ దా నెరఁగఁడా
యెనసెను శ్రీ వేంకటేశుఁడు తానైనవాఁడు
తననాసమేళములు తా నెరఁగడా
(||pallavi||)
emi vinnabālu sese rĕṁdām̐kā nādanidoḍa
tā manniṁchina mannana tā nĕram̐gam̐ḍā
(||emi||)
valĕ nani nannu niṁtavalabaṁchinaṭṭivām̐ḍu
talam̐sinappuḍĕ rām̐dā nĕram̐gam̐ḍā
sali vābi tanabŏṁdusavulu sūbinavām̐ḍu
talam̐ga kāmīm̐dimāḍa tā nĕram̐gaḍā
(||emi||)
nagi nādo negadāna nammiga lichchinavām̐ḍu
taga nāgoba moruvam̐dā nĕram̐gam̐ḍā
pagaḍudo nannum̐ dŏlli balimisesinavām̐ḍu
tagavu lannī naḍabam̐ dā nĕram̐gam̐ḍā
(||emi||)
sĕnagi nāsiggu vīḍam̐ jĕyisām̐sinaṭṭivām̐ḍu
tanivim̐ bŏṁdiṁcha nannum̐ dā nĕram̐gam̐ḍā
yĕnasĕnu śhrī veṁkaḍeśhum̐ḍu tānainavām̐ḍu
tananāsameḽamulu tā nĕram̐gaḍā