Emi vegiramu naa kimtadilone

ఏమి వేగిరము నా కింతటిలోనే
Language

(॥పల్లవి॥)
ఏమి వేగిరము నా కింతటిలోనే
దీమసాన నీ గుణము తిద్దలేనిదాననా

(॥ఏమి॥)
పల్లదపు నీమాటకు పదరేటిదాననా
పెల్లున నిన్నింతలోఁ గోపించేదాననా
చెల్లుబడినీచనపు చెల్లించనిదాననా
చల్లఁగా నీవలపు రేంచఁగలేనిదాననా

(॥ఏమి॥)
అంతలో నవ్వితే నర్తమడిగేటిదాననా
కాంతుఁడ నీయిచ్చ యెఱఁగనిదాననా
పంతమాడి నిన్నింతలో భ్రమయించేదాననా
మంతనాన నీమన్నన మఱచేటిదాననా

(॥ఏమి॥)
ప్రియము చెప్పఁగా నీతో బిగిసేటిదాననా
క్రియ యెఱఁగక కరఁగించేదాననా
రయమున శ్రీవేంకటరమణ నన్నుఁ గూడితివి
నయమిచ్చి నీకాఁగిట నాటుకోనిదాననా

(||pallavi||)
emi vegiramu nā kiṁtaḍilone
dīmasāna nī guṇamu tiddalenidānanā

(||emi||)
palladabu nīmāḍagu padareḍidānanā
pĕlluna ninniṁtalom̐ gobiṁchedānanā
sĕllubaḍinīsanabu sĕlliṁchanidānanā
sallam̐gā nīvalabu reṁcham̐galenidānanā

(||emi||)
aṁtalo navvide nardamaḍigeḍidānanā
kāṁtum̐ḍa nīyichcha yĕṟam̐ganidānanā
paṁtamāḍi ninniṁtalo bhramayiṁchedānanā
maṁtanāna nīmannana maṟaseḍidānanā

(||emi||)
priyamu sĕppam̐gā nīdo bigiseḍidānanā
kriya yĕṟam̐gaga karam̐giṁchedānanā
rayamuna śhrīveṁkaḍaramaṇa nannum̐ gūḍidivi
nayamichchi nīgām̐giḍa nāḍugonidānanā