Emi tagavulu seppe mimkaa meegu

ఏమి తగవులు చెప్పే మింకా మీకు
Language

(॥పల్లవి॥)
ఏమి తగవులు చెప్పే మింకా మీకు
ఆముకొన్న వలపుల కవియెల్లా దొడ్డా

(॥ఏమి॥)
తలపునిలువలేని తమకము గలయట్టి-
చెలి ని న్నెంతసేసినాఁ జెల్లునయ్యా
బలిమిఁ బట్టుక నిన్ను పడఁతులు చూడఁగానే
అలమో వెంగిలిసేసే దదియేమి దొడ్డా

(॥ఏమి॥)
ఆయములు గరఁగి కాయము మదించినసతి
చేయిమీఁదై చెనకఁగం జెల్లునయ్యా
దాయము వచ్చినవేళ దాఁచరానిచోట్ల
యీయెడ గుఱుతుసేసు టదియేమి దొడ్డా

(॥ఏమి॥)
అందుక నీవురమెక్కినట్టియలమేలుమంగ
చెంది నిన్నెంత గూడినాఁ జెల్లునయ్యా
అందపుశ్రీవేంకటేశ అట్టె పాదాలు చాఁచుక
యెందుకునైనా నవ్వే దిదియేమి దొడ్డా

(||pallavi||)
emi tagavulu sĕppe miṁkā mīgu
āmugŏnna valabula kaviyĕllā dŏḍḍā

(||emi||)
talabuniluvaleni tamagamu galayaṭṭi-
sĕli ni nnĕṁtasesinām̐ jĕllunayyā
balimim̐ baṭṭuga ninnu paḍam̐tulu sūḍam̐gāne
alamo vĕṁgilisese dadiyemi dŏḍḍā

(||emi||)
āyamulu garam̐gi kāyamu madiṁchinasadi
seyimīm̐dai sĕnagam̐gaṁ jĕllunayyā
dāyamu vachchinaveḽa dām̐sarānisoṭla
yīyĕḍa guṟudusesu ṭadiyemi dŏḍḍā

(||emi||)
aṁduga nīvuramĕkkinaṭṭiyalamelumaṁga
sĕṁdi ninnĕṁta gūḍinām̐ jĕllunayyā
aṁdabuśhrīveṁkaḍeśha aṭṭĕ pādālu sām̐suga
yĕṁdugunainā navve didiyemi dŏḍḍā