ఏమి సుద్దు లడిగేవు ఇంకా మమ్ము
(॥పల్లవి॥)
ఏమి సుద్దు లడిగేవు ఇంకా మమ్ము
గామిడివైతి వనఁగా కడఁగి మెచ్చితిమి
(॥ఆఁట॥)
వాడలలోనెల్లా నీవు వలపు చల్లితివని
వేడుకగా మాటలెల్లా వింటిమి నేము
వాడికతో నీకు నన్నివావు లొక్కటాయనని
ఆడుకోఁగా నేము వెరగందితి మిందరము
(॥ఆఁట॥)
కోరికతో నీవు పెండ్లికొడుకవై యుండఁగాను
చేరి సంతోసాలెల్లాఁ జూచితిమి నేము
దూరుగా నీమోవి గొల్లదోమటాయ ననఁగాను
నారుకోన్న ప్రేమతోడ నవ్వితి మిందరము
(॥ఆఁట॥)
సుదతులకెల్లాను చుట్టమవైనందుకు
కెలసి యానందానఁ జొక్కితిమి నేము
యెలమి శ్రీ వేంకటేశ యేలితివి మమ్ము నేఁడు
కలసినరతులఁ బొగతిడి మిందరము
(||pallavi||)
emi suddu laḍigevu iṁkā mammu
gāmiḍivaidi vanam̐gā kaḍam̐gi mĕchchidimi
(||ām̐ṭa||)
vāḍalalonĕllā nīvu valabu sallidivani
veḍugagā māḍalĕllā viṁṭimi nemu
vāḍigado nīgu nannivāvu lŏkkaḍāyanani
āḍugom̐gā nemu vĕragaṁdidi miṁdaramu
(||ām̐ṭa||)
korigado nīvu pĕṁḍligŏḍugavai yuṁḍam̐gānu
seri saṁtosālĕllām̐ jūsidimi nemu
dūrugā nīmovi gŏlladomaḍāya nanam̐gānu
nārugonna premadoḍa navvidi miṁdaramu
(||ām̐ṭa||)
sudadulagĕllānu suṭṭamavainaṁdugu
kĕlasi yānaṁdānam̐ jŏkkidimi nemu
yĕlami śhrī veṁkaḍeśha yelidivi mammu nem̐ḍu
kalasinaradulam̐ bŏgadiḍi miṁdaramu