ఏమి చూచుకొన్నాఁడవో యెఱఁగ నేను
(॥పల్లవి॥)
ఏమి చూచుకొన్నాఁడవో యెఱఁగ నేను
కామించి నీ మన్ననలో కడమలూఁ గానము
(॥ఏమి॥)
దవ్వుల నుండిననన్ను దగ్గరఁ బిలుచుకొంటే
చివ్వన నీకు మేలు చేరదా నేఁడు
రవ్వగానీ కొలువులో రాజసమె చూపఁగాను
యివ్వల నవ్వల నీవు యేమి గట్టుకొంటివి
(॥ఏమి॥)
దట్టపువిరహి నన్నుఁ దప్పక చూచితేను
అట్టె దయ గలవాఁడ వని మెచ్చనా
గుట్టుతోడ నిందరిలో కొంచి కొంచి నవ్వఁగాను
యెట్ట నెదురుకట్ల నందు కెక్కెఁ బనులు
(॥ఏమి॥)
యింటిలో నుండిననన్ను యిటు నీవు గలసితే
జంట వై పొందులు సేయ జాణవు గావా
అంటితివి శ్రీవెంకటాధిప తెరలో నన్ను
వెంట వచ్చి కూడితిని వింత లాయఁ జేతలు
(||pallavi||)
emi sūsugŏnnām̐ḍavo yĕṟam̐ga nenu
kāmiṁchi nī mannanalo kaḍamalūm̐ gānamu
(||emi||)
davvula nuṁḍinanannu daggaram̐ bilusugŏṁṭe
sivvana nīgu melu seradā nem̐ḍu
ravvagānī kŏluvulo rājasamĕ sūbam̐gānu
yivvala navvala nīvu yemi gaṭṭugŏṁṭivi
(||emi||)
daṭṭabuvirahi nannum̐ dappaga sūsidenu
aṭṭĕ daya galavām̐ḍa vani mĕchchanā
guṭṭudoḍa niṁdarilo kŏṁchi kŏṁchi navvam̐gānu
yĕṭṭa nĕdurugaṭla naṁdu kĕkkĕm̐ banulu
(||emi||)
yiṁṭilo nuṁḍinanannu yiḍu nīvu galaside
jaṁṭa vai pŏṁdulu seya jāṇavu gāvā
aṁṭidivi śhrīvĕṁkaḍādhiba tĕralo nannu
vĕṁṭa vachchi kūḍidini viṁta lāyam̐ jedalu