Emi soosevu naavamka yim demaina tappu gaddo

ఏమి చూచేవు నావంక యిం దేమైన తప్పు గద్దో
Language

(॥పల్లవి॥)
ఏమి చూచేవు నావంక యిం దేమైన తప్పు గద్దో
ప్రేమము నీ కొప్పించితి బిగు వింక నేలా

(॥ఏమి॥)
నిక్కి నా విరహము నీకు మే లైతేఁ జాలు
ముక్క వోయి నా మోహములోన
వొక్కరి కైన సెలవు వున్నదిగా యీ బదుకు
చక్కని వో రమణుఁడ చాలదా యీజన్మము

(॥ఏమి॥)
చింతతోడ నే నుండేది సెలవు నీ కైతేఁ జాలు
పంతము దప్పెనా నాబలువుకును
వంతు వాసి కెక్కఁగా నావగ పోకచోట నైన
సంత మైన నాయకుఁడ చాలదా నాజన్మము

(॥ఏమి॥)
ఆసలచే వేఁగేది నీ కంత వేడు కైతేఁ జాలు
దోసమా నా సైరణకు దొండి వోయీనా
యీసు లేక శ్రీవెంకటేశుఁడ నన్నుఁ గూడితి
శాసించ నేఁటికి నిన్నుఁ జాలదా నా జన్మము

(||pallavi||)
emi sūsevu nāvaṁka yiṁ demaina tappu gaddo
premamu nī kŏppiṁchidi bigu viṁka nelā

(||emi||)
nikki nā virahamu nīgu me laidem̐ jālu
mukka voyi nā mohamulona
vŏkkari kaina sĕlavu vunnadigā yī badugu
sakkani vo ramaṇum̐ḍa sāladā yījanmamu

(||emi||)
siṁtadoḍa ne nuṁḍedi sĕlavu nī kaidem̐ jālu
paṁtamu dappĕnā nābaluvugunu
vaṁtu vāsi kĕkkam̐gā nāvaga pogasoḍa naina
saṁta maina nāyagum̐ḍa sāladā nājanmamu

(||emi||)
āsalase vem̐gedi nī kaṁta veḍu kaidem̐ jālu
dosamā nā sairaṇagu dŏṁḍi voyīnā
yīsu lega śhrīvĕṁkaḍeśhum̐ḍa nannum̐ gūḍidi
śhāsiṁcha nem̐ṭigi ninnum̐ jāladā nā janmamu