Emi soosevu naadikku yemtavadiyainaanu

ఏమి చూచేవు నాదిక్కు యెంతవడియైనాను
Language

(॥పల్లవి॥)
ఏమి చూచేవు నాదిక్కు యెంతవడియైనాను
యీ మేరలనే నిన్ను యెగసక్కె మాడేనా

(॥ఏమి॥)
ప్రియురాలు నీవును పెండ్లాడఁగా జూచి
నయగారితనమున నగె నొకతె
క్రియగా నాపెయెరుకఁ గెర లేమిసేసితివో
నియతాననుఁ దారుకాణించుకోవయ్యా

(॥ఏమి॥)
చెలరేఁగి యాపె నీవు సేసవెట్టుకోఁగాఁ జూచి
సొలసి కేరడముగాఁ జూచె నొకతె
కలఁకలేనినీవోళ్లఁ గపటమేమైనాఁ గద్దో
తిలకించి యీసుద్దులు తెలుపుకోవయ్యా

(॥ఏమి॥)
అలమేల్మంగతో బువ్వమారగించేనిన్నుఁ జూచి
మెలుపునఁ బొగడుచు మెచ్చె నొక్కతె
అలరి శ్రీవేంకటేశ అందరిమమ్మేలితివి
కలిగిన నమ్మక లిక్కడఁ జూపవయ్యా

(||pallavi||)
emi sūsevu nādikku yĕṁtavaḍiyainānu
yī meralane ninnu yĕgasakkĕ māḍenā

(||emi||)
priyurālu nīvunu pĕṁḍlāḍam̐gā jūsi
nayagāridanamuna nagĕ nŏgadĕ
kriyagā nābĕyĕrugam̐ gĕra lemisesidivo
niyadānanum̐ dārugāṇiṁchugovayyā

(||emi||)
sĕlarem̐gi yābĕ nīvu sesavĕṭṭugom̐gām̐ jūsi
sŏlasi keraḍamugām̐ jūsĕ nŏgadĕ
kalam̐kaleninīvoḽlam̐ gabaḍamemainām̐ gaddo
tilagiṁchi yīsuddulu tĕlubugovayyā

(||emi||)
alamelmaṁgado buvvamāragiṁcheninnum̐ jūsi
mĕlubunam̐ bŏgaḍusu mĕchchĕ nŏkkadĕ
alari śhrīveṁkaḍeśha aṁdarimammelidivi
kaligina nammaga likkaḍam̐ jūbavayyā