ఏమి చూచే వింతిదిక్కు యెందాఁకాను
(॥పల్లవి॥)
ఏమి చూచే వింతిదిక్కు యెందాఁకాను
సాములనే చెనకుచు చనవియ్యరాదా
(॥॥)
కొప్పు నీవు ముట్టితేను కుప్పవడీ వెంట్రుకలు
చిప్పిల నంతలోఁ జెలి సిగ్గువడెను
వొప్పుగ జవ్వాది చేత నొక్కింత చమరుకొని
కప్పినీవైనా కీలుగంటు వేయరాదా
(॥॥)
పొలసి పయ్యెదంటితే పోఁకముడి జారెను
వెలయ నంతలో నింతి వెరగందెను
బలిమిఁ బన్నీటను పదనుగాఁ జలికించి
చెలరేఁగి యిప్పుడే కుచ్చెల వోయరాదా
(॥॥)
కడఁగి కాఁగిలించితే గందపుఁ బెంట్లు రాలెను
నడుమ నందుకుఁ గాంత నవ్వు నవ్వెను
అడరి శ్రీవేంకటేశ అంగపుఁ జెమట నించి
తడిపి కమ్మటి వసంతము చల్లరాదా
(||pallavi||)
emi sūse viṁtidikku yĕṁdām̐kānu
sāmulane sĕnagusu sanaviyyarādā
(||||)
kŏppu nīvu muṭṭidenu kuppavaḍī vĕṁṭrugalu
sippila naṁtalom̐ jĕli sigguvaḍĕnu
vŏppuga javvādi seda nŏkkiṁta samarugŏni
kappinīvainā kīlugaṁṭu veyarādā
(||||)
pŏlasi payyĕdaṁṭide pom̐kamuḍi jārĕnu
vĕlaya naṁtalo niṁti vĕragaṁdĕnu
balimim̐ bannīḍanu padanugām̐ jaligiṁchi
sĕlarem̐gi yippuḍe kuchchĕla voyarādā
(||||)
kaḍam̐gi kām̐giliṁchide gaṁdabum̐ bĕṁṭlu rālĕnu
naḍuma naṁdugum̐ gāṁta navvu navvĕnu
aḍari śhrīveṁkaḍeśha aṁgabum̐ jĕmaḍa niṁchi
taḍibi kammaḍi vasaṁtamu sallarādā