(॥పల్లవి॥)
ఏమి సోద్యమే యీవేళ సతికి
కాముని బలములు కైవశమాయ
(॥ఏమి॥)
సుదతి నీదుపఁ జులవెలుఁగంటా
వుదయచందురుని కెదురేఁగి
ముదమునఁ గాళెలమోతలనుచు మరి
కొదమతుమ్మిదలకూఁతల కలరె
(॥ఏమి॥)
తోడనె టెక్కెపుదొడ్డపవుఁజులని
నీడలతరువులు నిక్కి చూచి
కేడించుగాలికిఁ గెరలినపుప్పొడి
చూడ ధూళియని వేడుకపడియె
(॥ఏమి॥)
చిఁత దీర నీసేసపాలనుచు
చెంతనె విరులకు శిరసొగ్గి
యింతలో శ్రీవేంకటేశ నీవేలఁగ
సంతసమునఁ దనచందము దెలిసె
(||pallavi||)
emi sodyame yīveḽa sadigi
kāmuni balamulu kaivaśhamāya
(||emi||)
sudadi nīdubam̐ julavĕlum̐gaṁṭā
vudayasaṁduruni kĕdurem̐gi
mudamunam̐ gāḽĕlamodalanusu mari
kŏdamadummidalagūm̐tala kalarĕ
(||emi||)
toḍanĕ ṭĕkkĕbudŏḍḍabavum̐julani
nīḍaladaruvulu nikki sūsi
keḍiṁchugāligim̐ gĕralinabuppŏḍi
sūḍa dhūḽiyani veḍugabaḍiyĕ
(||emi||)
sim̐ta dīra nīsesabālanusu
sĕṁtanĕ virulagu śhirasŏggi
yiṁtalo śhrīveṁkaḍeśha nīvelam̐ga
saṁtasamunam̐ danasaṁdamu dĕlisĕ