Emi sitram bemi mahimalu yemi nee maayaavinodamu

ఏమి చిత్రం బేమి మహిమలు యేమి నీ మాయావినోదము
Language

(॥పల్లవి॥)
ఏమి చిత్రం బేమి మహిమలు యేమి నీ మాయావినోదము
వామనాచ్యుత నిన్నుఁ దెలియఁగ వసుధలో మా తరములా

(॥ఏమి॥)
సకలలోక నివాసనాయక శౌరి మురహర నరహరీ
ప్రకటమాయెను నీ గుణంబులు పాలముచ్చ వటంచును
వికటముగ నినుఁ గన్నతల్లి వేల నీ వదనంబు మీఁటిన
అకట హా యని నోరు దెరచిన యందు లోకము లుండెను

(॥ఏమి॥)
శ్రీసతీపతి దైత్యదానవశిక్ష కామర రక్షక
రాసి కెక్కెను బండిరొప్పిన రవ్వలా నీ సేఁతలు
మోసమున నర్జునుఁడు నీలో ముందు గానక మాటలాడిన
వాసవార్చిత విశ్వరూపము వసుధఁ జూపితి వవుదువు

(॥ఏమి॥)
నమోనమో శ్రీ వేంకటేశ్వర నారదప్రియ భక్తవత్సల
విమలమగు నీ దాసు లిదె నీ విద్య లెల్లాఁ జూచిరి
సుముఖులై కరి శబరి బలియును శుకధ్రువాదులు నిన్నుఁ గొలువఁగ
సమత వున్నతపదము లొసఁగితి సర్వమిందునుఁ గంటిమి

(||pallavi||)
emi sitraṁ bemi mahimalu yemi nī māyāvinodamu
vāmanāchyuda ninnum̐ dĕliyam̐ga vasudhalo mā taramulā

(||emi||)
sagalaloga nivāsanāyaga śhauri murahara naraharī
pragaḍamāyĕnu nī guṇaṁbulu pālamuchcha vaḍaṁchunu
vigaḍamuga ninum̐ gannadalli vela nī vadanaṁbu mīm̐ṭina
agaḍa hā yani noru dĕrasina yaṁdu logamu luṁḍĕnu

(||emi||)
śhrīsadībadi daityadānavaśhikṣha kāmara rakṣhaga
rāsi kĕkkĕnu baṁḍirŏppina ravvalā nī sem̐talu
mosamuna narjunum̐ḍu nīlo muṁdu gānaga māḍalāḍina
vāsavārsida viśhvarūbamu vasudham̐ jūbidi vavuduvu

(||emi||)
namonamo śhrī veṁkaḍeśhvara nāradapriya bhaktavatsala
vimalamagu nī dāsu lidĕ nī vidya lĕllām̐ jūsiri
sumukhulai kari śhabari baliyunu śhugadhruvādulu ninnum̐ gŏluvam̐ga
samada vunnadabadamu lŏsam̐gidi sarvamiṁdunum̐ gaṁṭimi