Emi seyumaneve imkaa neevu

ఏమి సేయుమనేవే ఇంకా నీవు
Language

(॥పల్లవి॥)
ఏమి సేయుమనేవే ఇంకా నీవు
కోమలపు రమణుని కొలువూఁ జేసితిని

(॥ఏమి॥)
ముంగిట నాతని తోడ ముచ్చటలాడితి నే
నంగవించి యిందాఁకా నది చాలదా
జంగిలి సతులలోన సరసమూ నాడితిని
యెంగిలివలపులాయ నిఁకనేలే నేను

(॥ఏమి॥)
నంటుదోఁచఁ బతితోడ నవ్వులు నవ్వితిని
ఇంటికిఁ బిలువనంపె నింతలో నేలే
కంటఁ గంటఁ దనమోము కన్నులారఁ జూచితిని
అంటఁగాకుండితి నంటి నదివో నామాట

(॥ఏమి॥)
ఇప్పుడిట్టె తా రాఁగా నెదురుగా వచ్చితిని
తప్పనియలుక నాకుఁ దనతో నేదే
చెప్పరానిబాస ఇచ్చి శ్రీవేంకటేశుఁడు గూడె
తప్పులెల్లాఁ దీరె నిఁక తలపోఁతలేలే

(||pallavi||)
emi seyumaneve iṁkā nīvu
komalabu ramaṇuni kŏluvūm̐ jesidini

(||emi||)
muṁgiḍa nādani toḍa muchchaḍalāḍidi ne
naṁgaviṁchi yiṁdām̐kā nadi sāladā
jaṁgili sadulalona sarasamū nāḍidini
yĕṁgilivalabulāya nim̐kanele nenu

(||emi||)
naṁṭudom̐sam̐ badidoḍa navvulu navvidini
iṁṭigim̐ biluvanaṁpĕ niṁtalo nele
kaṁṭam̐ gaṁṭam̐ danamomu kannulāram̐ jūsidini
aṁṭam̐gāguṁḍidi naṁṭi nadivo nāmāḍa

(||emi||)
ippuḍiṭṭĕ tā rām̐gā nĕdurugā vachchidini
tappaniyaluga nāgum̐ danado nede
sĕpparānibāsa ichchi śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
tappulĕllām̐ dīrĕ nim̐ka talabom̐talele