Emi seyumanevayya yimkaa nannu

ఏమి సేయుమనేవయ్య యింకా నన్ను
Language

(॥పల్లవి॥)
ఏమి సేయుమనేవయ్య యింకా నన్ను
నీమీఁది ప్రేమకు కరుణించఁగ వద్దా

(॥ఏమి॥)
చెప్పిననీ మాఁటలెల్లా చెవియొగ్గి వింటి నేను
కప్పురవిడె మియ్యఁగాఁ గైకొంటివి
అప్పటి నే నేమిసేతు నాఁటదాన నింతే నేను
తప్పునీపట్టుకు దయఁదలఁచవద్దా

(॥ఏమి॥)
అంగవించి పిలువఁగ నట్టె దగ్గరివచ్చితి
కొంగువట్టి తియ్యఁగానే కూచుండితి
సంగ తానతియ్యవయ్య నన్నపుగొలదాన
చెంగట మొక్కేను కృపసేయఁగవద్దా

(॥ఏమి॥)
నీవు గాఁగిలించఁగాను నీచేతఁకు లోనైతి
వావిసేసుక నవ్వితే వసమైతిని
శ్రీవేంకటేశ నీసేసపెండ్లిదాన నింతే
కేవలమై యిఁక కనికరించవద్దా

(||pallavi||)
emi seyumanevayya yiṁkā nannu
nīmīm̐di premagu karuṇiṁcham̐ga vaddā

(||emi||)
sĕppinanī mām̐ṭalĕllā sĕviyŏggi viṁṭi nenu
kappuraviḍĕ miyyam̐gām̐ gaigŏṁṭivi
appaḍi ne nemisedu nām̐ṭadāna niṁte nenu
tappunībaṭṭugu dayam̐dalam̐savaddā

(||emi||)
aṁgaviṁchi piluvam̐ga naṭṭĕ daggarivachchidi
kŏṁguvaṭṭi tiyyam̐gāne kūsuṁḍidi
saṁga tānadiyyavayya nannabugŏladāna
sĕṁgaḍa mŏkkenu kṛpaseyam̐gavaddā

(||emi||)
nīvu gām̐giliṁcham̐gānu nīsedam̐ku lonaidi
vāvisesuga navvide vasamaidini
śhrīveṁkaḍeśha nīsesabĕṁḍlidāna niṁte
kevalamai yim̐ka kanigariṁchavaddā