Emi seyumanevayya yimka nannunu

ఏమి సేయుమనేవయ్య యిఁక నన్నును
Language

(॥పల్లవి॥)
ఏమి సేయుమనేవయ్య యిఁక నన్నును
చే ముట్టి వీడెమీవయ్య సిగ్గయ్యీని

(॥॥)
ఆతీల నాపె నీతో నట్టే మాటలాడఁగా
నాతో నీవు నవ్వఁగా నవ్వు వచ్చీని
రాతిరిఁ బగలు నీవు రచ్చలలో నుండి వచ్చి
చేత నా చెక్కు నొక్కఁగ సిగ్గయ్యీని

(॥॥)
వున్నతి నాపె నీవొడివట్టి తియ్యఁగాను
నన్ను నీవు చేపట్టఁగానవ్వు వచ్చీని
కన్నవారినెల్లా నీవు కాఁగిలించుకొని వచ్చి
చిన్ని నా చన్నులంటఁగా సిగ్గయ్యీని

(॥॥)
భావించి యాపె నీకుఁ బానుపు వరచఁగాను
నావద్ద నీవు పండఁగా నవ్వు వచ్చీని
శ్రీవేంకటేశ్వరుఁడ చేఁతలెల్లాఁ జేసి వచ్చి
చేపట్టి నన్నుఁ గూడఁగా సిగ్గయ్యీని

(||pallavi||)
emi seyumanevayya yim̐ka nannunu
se muṭṭi vīḍĕmīvayya siggayyīni

(||||)
ādīla nābĕ nīdo naṭṭe māḍalāḍam̐gā
nādo nīvu navvam̐gā navvu vachchīni
rādirim̐ bagalu nīvu rachchalalo nuṁḍi vachchi
seda nā sĕkku nŏkkam̐ga siggayyīni

(||||)
vunnadi nābĕ nīvŏḍivaṭṭi tiyyam̐gānu
nannu nīvu sebaṭṭam̐gānavvu vachchīni
kannavārinĕllā nīvu kām̐giliṁchugŏni vachchi
sinni nā sannulaṁṭam̐gā siggayyīni

(||||)
bhāviṁchi yābĕ nīgum̐ bānubu varasam̐gānu
nāvadda nīvu paṁḍam̐gā navvu vachchīni
śhrīveṁkaḍeśhvarum̐ḍa sem̐talĕllām̐ jesi vachchi
sebaṭṭi nannum̐ gūḍam̐gā siggayyīni