Emi seyudunu ne nemi seyudunu

ఏమి సేయుదును నే నేమి సేయుదును
Language

(॥పల్లవి॥)
ఏమి సేయుదును నే నేమి సేయుదును
స్వామిద్రోహమె జరగీని

(॥ఏమి॥)
నీ యాధీనమై నెగడిన యాత్మకు
నీ యందె బుద్ది నిలువదు
కాయపుటింద్రియ కల్పిత దేహము
కాయపు విషయాలె కడుఁ గోరీని

(॥ఏమి॥)
నీ సంకల్పమున నెగడిన జగ మిది
నీ సేవారతి నేరదు
ఆసల నీ మాయ నంటిన మన సిది
ఆసలాసలనే అలసీని

(॥ఏమి॥)
హరి నీవే నాలోన నణచిన జ్ఞానము
హరి నీవె చూపక అందదూ
సిరుల నా పాలిటి శ్రీ వేంకటేశ్వర
కరుణానిధి నన్నుఁ గావవే

(||pallavi||)
emi seyudunu ne nemi seyudunu
svāmidrohamĕ jaragīni

(||emi||)
nī yādhīnamai nĕgaḍina yātmagu
nī yaṁdĕ buddi niluvadu
kāyabuḍiṁdriya kalbida dehamu
kāyabu viṣhayālĕ kaḍum̐ gorīni

(||emi||)
nī saṁkalbamuna nĕgaḍina jaga midi
nī sevāradi neradu
āsala nī māya naṁṭina mana sidi
āsalāsalane alasīni

(||emi||)
hari nīve nālona naṇasina jñānamu
hari nīvĕ sūbaga aṁdadū
sirula nā pāliḍi śhrī veṁkaḍeśhvara
karuṇānidhi nannum̐ gāvave