ఏమి సేయుదును నా యుద్యోగము యెంతో నా యాసోదము
(॥పల్లవి॥)
ఏమి సేయుదును నా యుద్యోగము యెంతో నా యాసోదము
కామింతుఁ గాని యిందులో నొకటిఁ గలుగదు వృథా మనోరాజ్యము
(॥ఏమి॥)
ఆకరుషించఁ దలంతును అప్సరోగణములను
కైకొని దేవతాసమితినిఁ గనుఁగొనఁ దలఁతును
యేకముగా బ్రహ్మాదిలోకము లేలఁ దలఁతును
దాకొని నిద్రింతు నంతలోన హరిఁ దలఁచినవాఁడఁగానైతి
(॥ఏమి॥)
ఒకపరి యీశ్వరుఁడ నౌదును వూహాపోహలను
ప్రకటపు పట్టణగోపురప్రాకారంబులు సృజింతును
సకలము భోగించినవాఁడ నౌదు చవు లూరకే కొందును
అకటా అంతలో భిక్షాన కేఁగుదు హరిఁ గొలిచినవాఁడగానైతి
(॥ఏమి॥)
తలఁచినచోటికి నేఁగఁ దలఁతును తగఁ జన్నవారిని బ్రదికింతును
మలసి యంతలోఁ బనులకుఁ బిలిచిన మఱియన్నియు నేమఱతును
చెలఁగుచు నలమేల్మంగ విభుఁడ వో శ్రీవేంకటగిరి నిలయా
నెలకొని నన్నిటు రక్షించఁగదవే నిను సేవించేవాఁడఁగానైతి
(||pallavi||)
emi seyudunu nā yudyogamu yĕṁto nā yāsodamu
kāmiṁtum̐ gāni yiṁdulo nŏgaḍim̐ galugadu vṛthā manorājyamu
(||emi||)
āgaruṣhiṁcham̐ dalaṁtunu apsarogaṇamulanu
kaigŏni devadāsamidinim̐ ganum̐gŏnam̐ dalam̐tunu
yegamugā brahmādilogamu lelam̐ dalam̐tunu
dāgŏni nidriṁtu naṁtalona harim̐ dalam̐sinavām̐ḍam̐gānaidi
(||emi||)
ŏgabari yīśhvarum̐ḍa naudunu vūhābohalanu
pragaḍabu paṭṭaṇagoburaprāgāraṁbulu sṛjiṁtunu
sagalamu bhogiṁchinavām̐ḍa naudu savu lūrage kŏṁdunu
agaḍā aṁtalo bhikṣhāna kem̐gudu harim̐ gŏlisinavām̐ḍagānaidi
(||emi||)
talam̐sinasoḍigi nem̐gam̐ dalam̐tunu tagam̐ jannavārini bradigiṁtunu
malasi yaṁtalom̐ banulagum̐ bilisina maṟiyanniyu nemaṟadunu
sĕlam̐gusu nalamelmaṁga vibhum̐ḍa vo śhrīveṁkaḍagiri nilayā
nĕlagŏni nanniḍu rakṣhiṁcham̐gadave ninu seviṁchevām̐ḍam̐gānaidi