Emi seyu mannam jesee yerabarigamu lela

ఏమి సేయు మన్నఁ జేసీ యెరపరికము లేల
Language

(॥పల్లవి॥)
ఏమి సేయు మన్నఁ జేసీ యెరపరికము లేల
చే ముంచితి నా యడకు శిబ్బితి పడకురా

(॥ఏమి॥)
చేరి నాతో నేమో మాట చెప్ప వచ్చినవాఁడవు
కోరి యంతలోనే గుక్కుకొందురా నీవు
వూరకే మా యింటిదాఁక నొంటి వచ్చినవాఁడవు
పోరచి వై యట్టె మళ్లి పోదురా నీవు

(॥ఏమి॥)
మొదల నాతో నవ్వ మొగ మెత్తినవాఁడవు
వదలి యంతలోఁ దల వంతురా నీవు
పదిమారులు నన్నుఁ దప్పక చూచినవాఁడవు
చెదరి యట్టె పరాకు సేతురా నీవు

(॥ఏమి॥)
యిట్టె నన్నుఁ గాఁగిటిలో యెచ్చరించినవాఁడవు
ఱట్టు కెక్క నీ మేను మఱతురా నీవు
గుట్టున శ్రీవెంకటేశ కూడినట్టివాఁడవు
యిట్టెనై వెనక ముందు లెంతురా నీవు

(||pallavi||)
emi seyu mannam̐ jesī yĕrabarigamu lela
se muṁchidi nā yaḍagu śhibbidi paḍagurā

(||emi||)
seri nādo nemo māḍa sĕppa vachchinavām̐ḍavu
kori yaṁtalone gukkugŏṁdurā nīvu
vūrage mā yiṁṭidām̐ka nŏṁṭi vachchinavām̐ḍavu
porasi vai yaṭṭĕ maḽli podurā nīvu

(||emi||)
mŏdala nādo navva mŏga mĕttinavām̐ḍavu
vadali yaṁtalom̐ dala vaṁturā nīvu
padimārulu nannum̐ dappaga sūsinavām̐ḍavu
sĕdari yaṭṭĕ parāgu sedurā nīvu

(||emi||)
yiṭṭĕ nannum̐ gām̐giḍilo yĕchchariṁchinavām̐ḍavu
ṟaṭṭu kĕkka nī menu maṟadurā nīvu
guṭṭuna śhrīvĕṁkaḍeśha kūḍinaṭṭivām̐ḍavu
yiṭṭĕnai vĕnaga muṁdu lĕṁturā nīvu