ఏమి సేయవచ్చునే యింతుల భాగ్యము గాక
(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చునే యింతుల భాగ్యము గాక
నేమ మాతఁడు దప్పితే నిండుకుండుటే మేలు
(॥ఏమి॥)
తగవెఱుఁగనివాఁడు దయదలఁచనివాఁడు
మొగఁడైతే మారాడక మొక్కేదే మేలు
మొగమోట లేనివాఁడు మునివలె నుండేవాఁడు
బిగిసితే నోర్చుకొని నగుటే మేలు
(॥ఏమి॥)
చే సూటికి రానివాఁడు సిగ్గు విడిచినవాఁడు
వాసి యంచకున్నఁ దలవంచుటే మేలు
ఆస విడిచినవాఁడు ఆడికె కోడనివాఁడు
దోము సేసితేను సంతోసించుటే మేలు
(॥ఏమి॥)
కక్కసీఁ డైనవాఁడు కడు నిష్టూరైనవాఁడు
చిక్కకున్నా నాతనిపై చింతే మేలు
అక్కరో శ్రీవేంకటేశుఁ డలమేలుమంగ నేను
అక్కడ న న్నేలినాఁడు అన్నియును మేలు
(||pallavi||)
emi seyavachchune yiṁtula bhāgyamu gāga
nema mādam̐ḍu dappide niṁḍuguṁḍuḍe melu
(||emi||)
tagavĕṟum̐ganivām̐ḍu dayadalam̐sanivām̐ḍu
mŏgam̐ḍaide mārāḍaga mŏkkede melu
mŏgamoḍa lenivām̐ḍu munivalĕ nuṁḍevām̐ḍu
bigiside norsugŏni naguḍe melu
(||emi||)
se sūḍigi rānivām̐ḍu siggu viḍisinavām̐ḍu
vāsi yaṁchagunnam̐ dalavaṁchuḍe melu
āsa viḍisinavām̐ḍu āḍigĕ koḍanivām̐ḍu
domu sesidenu saṁtosiṁchuḍe melu
(||emi||)
kakkasīm̐ ḍainavām̐ḍu kaḍu niṣhṭūrainavām̐ḍu
sikkagunnā nādanibai siṁte melu
akkaro śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu
akkaḍa na nnelinām̐ḍu anniyunu melu