Emi seyavachchunayyaa imtula bhaagyamu gaaga

ఏమి సేయవచ్చునయ్యా ఇంతుల భాగ్యము గాక
Language

(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చునయ్యా ఇంతుల భాగ్యము గాక
బూమెల నీ గుణములే బుద్దులు నేరుపవా

(॥ఏమి॥)
వెలుపలినీచేఁతలు వెల్లవిరులై యుండఁగా
తెలియదా నామాట దిష్టము నీకు
చలివాసి నీవలపు సరివచ్చివుండఁగాను
సెలవి నీనవ్వులింకాఁ జిమ్మిఁరేగవా

(॥ఏమి॥)
మికైలిపరాకులు నీమీఁద నిండివుండఁగాను
చిక్కదా నాకానికె చేతికి నీకు
మక్కువతో నీమేను మచ్చములు చూపఁగాను
తక్కక నీసిగ్గు లింకాఁదలకొనవా

(॥ఏమి॥)
కరగిననీరతులు కాంరిటిలో నుండఁగాను
యిరవుగావా నాగోరియెచ్చరికెలు
యెరవులేక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
ధరలోన నీబాసలు తగవులు చెప్పవా

(||pallavi||)
emi seyavachchunayyā iṁtula bhāgyamu gāga
būmĕla nī guṇamule buddulu nerubavā

(||emi||)
vĕlubalinīsem̐talu vĕllavirulai yuṁḍam̐gā
tĕliyadā nāmāḍa diṣhṭamu nīgu
salivāsi nīvalabu sarivachchivuṁḍam̐gānu
sĕlavi nīnavvuliṁkām̐ jimmim̐regavā

(||emi||)
migailibarāgulu nīmīm̐da niṁḍivuṁḍam̐gānu
sikkadā nāgānigĕ sedigi nīgu
makkuvado nīmenu machchamulu sūbam̐gānu
takkaga nīsiggu liṁkām̐dalagŏnavā

(||emi||)
karaginanīradulu kāṁriḍilo nuṁḍam̐gānu
yiravugāvā nāgoriyĕchcharigĕlu
yĕravulega śhrīveṁkaḍeśha nannu nelidivi
dharalona nībāsalu tagavulu sĕppavā