ఏమి సేయవచ్చునయ్య యేల సిగ్గులువడేవు
(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చునయ్య యేల సిగ్గులువడేవు
కామినుల కేమిచ్చినా ఘనమౌను ఫలము
(॥॥)
కమ్మి యెవ్వతెచన్నులఁ గస్తూరి వూసితివొ
వుమ్మడి నీ మేన నంటివున్నది నేఁడు
ఇమ్ముల నింతలోఁ జాచి యేల తుడుచుకొనేవు
నెమ్మి నీచేసినచేఁత నిన్నే తగిలెను
(॥॥)
పడఁతి కెవ్వతెకును బాగా లొసఁగితివో
వుడివోని నీపుక్కిట నున్నది నేఁడు
అడరి తలఁచుకొని యట్టే వుమియఁజూచేవు
నడుమ నీవిచ్చినపుణ్యమే నిన్నంటెను
(॥॥)
శ్రీవేంకటేశ యెవ్వతెఁ జేరి వురమెక్కితివో
వోవల నీవురముపై నున్నది నేఁడు
ఆవిధాన నన్నేలితి వన్నిటికి మెచ్చేవు
కావించిన వినోదము కడు నినుమడించె
(||pallavi||)
emi seyavachchunayya yela sigguluvaḍevu
kāminula kemichchinā ghanamaunu phalamu
(||||)
kammi yĕvvadĕsannulam̐ gastūri vūsidivŏ
vummaḍi nī mena naṁṭivunnadi nem̐ḍu
immula niṁtalom̐ jāsi yela tuḍusugŏnevu
nĕmmi nīsesinasem̐ta ninne tagilĕnu
(||||)
paḍam̐ti kĕvvadĕgunu bāgā lŏsam̐gidivo
vuḍivoni nībukkiḍa nunnadi nem̐ḍu
aḍari talam̐sugŏni yaṭṭe vumiyam̐jūsevu
naḍuma nīvichchinabuṇyame ninnaṁṭĕnu
(||||)
śhrīveṁkaḍeśha yĕvvadĕm̐ jeri vuramĕkkidivo
vovala nīvuramubai nunnadi nem̐ḍu
āvidhāna nannelidi vanniḍigi mĕchchevu
kāviṁchina vinodamu kaḍu ninumaḍiṁchĕ