Emi seyavachchunamma yee kaalamu

ఏమి సేయవచ్చునమ్మ యీ కాలము
Language

(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చునమ్మ యీ కాలము
కామినుల నెవ్వరైనాఁ గైకొందురా

(॥ఏమి॥)
యిచ్చకములాడేకాదా యింతులెల్లాఁ బతులను
పచ్చిగాఁగ భ్రమయించి వలపించేది
మచ్చరించి సతులెల్లా మఱియేల అగ్గువైరి
తచ్చి యిటువంటివారే తఱచైరి భువిని

(॥ఏమి॥)
సరసము లాడేకాదా సారెకును మనసులు
కరగిఁచి గర్వముల ఘనమయ్యేది
తరితీపుల మరేల తడబడేరు ముయ్యీడ
సరి నిందువంక మొగచాటాయ మోహము

(॥ఏమి॥)
నవ్వులు నవ్వేకాదా నయాన వేంకటేశు
రవ్వఁగాఁ గాఁగిటఁ గూడి రతికెక్కిరి
యివ్వల మరేల నన్ను నెవసె నీతఁడై పై పై
మువ్వంక నిందువంక నే మును వాయఁ బంతము

(||pallavi||)
emi seyavachchunamma yī kālamu
kāminula nĕvvarainām̐ gaigŏṁdurā

(||emi||)
yichchagamulāḍegādā yiṁtulĕllām̐ badulanu
pachchigām̐ga bhramayiṁchi valabiṁchedi
machchariṁchi sadulĕllā maṟiyela agguvairi
tachchi yiḍuvaṁṭivāre taṟasairi bhuvini

(||emi||)
sarasamu lāḍegādā sārĕgunu manasulu
karagim̐si garvamula ghanamayyedi
taridībula marela taḍabaḍeru muyyīḍa
sari niṁduvaṁka mŏgasāḍāya mohamu

(||emi||)
navvulu navvegādā nayāna veṁkaḍeśhu
ravvam̐gām̐ gām̐giḍam̐ gūḍi radigĕkkiri
yivvala marela nannu nĕvasĕ nīdam̐ḍai pai pai
muvvaṁka niṁduvaṁka ne munu vāyam̐ baṁtamu